ENHANCE THE QUALITY OF SERVICE IN PARAKAMANI-EO_ మరింత మెరుగ్గా పరకామణి సేవలు – తి.తి.దే ఈ.ఓ

Tirumala, 13 October 2017: The quality of service in Parakamani wing need to be enhanced for speedy counting and accounting of the daily hundi offerings both for currency and coin parakamani at Tirumala and Tirupati respectively said, TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Friday by EO along with JEOs Sri KS Sreenivasa Raju and Sri P Bhaskar with Parakamani Wing and Srivari Seva office. The EO instructed the Parakamani authorities to chalk out the manpower requirement and other machinery to enhance the quality of service in Parakamani.

He said, the Parakamani Sevakulu are rendering good services from the past five years. In the last five years, about 68,851 sevakulu from 538 batches have performed Parakamani Seva in Tirumala and Tirupati. “To extract much better services from them, there need to revive the existing system which would be done soon. For that the user department should come out with a concrete action plan of their requirements”, the EO reiterated.

Further he instructed the Srivari Seva officials to impart training to Parakamani Sevakulu accordingly and enhance their quality of service. The EO also said, the sevakulu hailing from private banks can also be given an opportunity with an age limit of 60 years for a period of three months.

CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, DyEO Parakamani Sri Rajendrudu, Srivari Seva HoD and PRO Dr T Ravi were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

మరింత మెరుగ్గా పరకామణి సేవలు – తి.తి.దే ఈ.ఓ

అక్టోబరు 13, తిరుమల 2017: తిరుమల శ్రీవారి ఆలయం మరియు తిరుపతిలోని పరకామణి విభాగంలో గత 5 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పరకామణి సేవకుల నుండి మరింత మెరుగైన సేవలు పొందే దిశగా సంబంధిత విభాగాలు కృషిచేయాలని తి.తి.దే ఈ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు.

శుక్రవారంనాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో పరకామణి విభాగం – పరకామణి సేవపై తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మరియు తిరుపతి జె.ఈ.ఓ శ్రీ పోలా భాస్కర్‌లతో కూడి ఆయన పరకామణి మరియు శ్రీవారి సేవ విభాగాలతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ.ఓ మాట్లాడుతూ 2012వ సంవత్సరంలో ప్రారంభమైన పరకామణి సేవలో ఇప్పటి వరకు 538 బ్యాచ్‌లకు గాను 68,851 మంది సేవకులు పరకామణి సేవలో సేవలందించారన్నారు.

వీరి నుండి మరింత మెరుగైన సేవలను పొందడంలో భాగంగా త్వరలో కొన్ని మార్పులను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పరకామణి విభాగంవారు అందుకు కావలసిన అంశాలను గుర్తించి తదనుగుణంగా శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకొనే విధంగా ప్రణాళికను రూపొందించాలని సూచించారు. శ్రీవారి సేవ విభాగం సిబ్బంది కూడా ఈ అంశాలకు అనుగుణంగా పరకామణి సేవకులకు శిక్షణను అందించి వారి నుండి మరింత మెరుగైన సేవలను పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

పరకామణి సేవలో ప్రయోగాత్మకంగా ప్రైవేట్‌ బ్యాంకు సిబ్బంది :-

అనంతరం ఆయన ఇటీవల కొందరు భక్తులు అందించిన సలహాల మేరకు ప్రైవెట్‌ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కూడా పరకామణి సేవలో అవకాశం ఇప్పించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల జె.ఈ.ఓకు సూచించారు. కాగా వీరి వయోపరిమితిని 60 ఏళ్ళకు పరిమితం చేయాలని తెలిపారు. ఈ విధానం 3 నెలల పాటు ప్రయోత్మకంగా కొనసాగించాలని, అనంతరం సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

పరకామణిలో నాణేలు లెక్కించడానికి నూతన పరికరాలు :-

పరకామణిలో నాణేలను మరింత వేగవంతంగా లెక్కించడానికి నూతన యంత్రాలను వెనువెంటనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న నూతన పరకామణి భవనాన్ని నవంబరు 30 నాటికల్లా పూర్తిచేయాలని సి.ఇ. శ్రీచంద్రశేఖర్‌ రెడ్డిని ఆదేశించారు.

ఈ సమావేశంలో తి.తి.దే ముఖ్య ఆర్థిక మరియు గణాంకాధికారి శ్రీ బాలాజీ, పరకామణి డిప్యూటి.ఈ.ఓ శ్రీ రాజేంద్రుడు, శ్రీవారిసేవ విభాగాధిపతి మరియు ప్రజాసంబంధాల అధికారి డా||టి.రవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.