SRIVARI TEMPLE CLOSED FOR LUNAR ECLIPSE_ జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత :

Tirumala, 30 January 2018: The Srivari temple will be shut down on January 31 from 11am to night 9.3pm in view of the lunar eclipse which begins at 5.18pm to 8.41pm. As a result the Rs.300 tickets, divya darshan tokens, tokens for aged, challenged, infants with parents and others will not be issued and even VIP darshan is only for protocol.

The Matrusri Tarigonda Vengamaba anna prasadam complex will be closed and devotes will not be allowed inside the VQC, all arjita sevas of Sahasra Kalashabisekam, kalyanotsavam, unjal seva, brahmotsavam, vasantotsavam, sahasra deepalankara sevas. The srivari temple will be open for only 5 hours and all devotees were advised to plan their visit to Tirumala on that basis.

The TTD has also cancelled the monthly Pournami Garuda Seva scheduled for January 31.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత :

తిరుమల, 2018 జనవరి 30: చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివుంచుతారు.

జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. చంద్రగ్రహణం కారణంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని కూడా మూసివేస్తారు. అన్నప్రసాదాల వితరణ లేని కారణంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి భక్తులకు అనుమతి ఉండదు. ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా టిటిడి రద్దు చేసింది. శ్రీవారి ఆలయం ఉదయం, రాత్రి కలిపి దాదాపు 5 గంటల పాటు మాత్రమే తెరిచి ఉంటుందని, భక్తులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తమ తిరుమల యాత్రను సాగించాలని టిటిడి కోరుతోంది.

జనవరి 31న పౌర్ణమి గరుడసేవ రద్దు :

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడసేవ బుధవారం నాడు రద్దయింది. చంద్రగ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవను రద్దు చేసినట్టు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.