HAMSA VAHANAM GIVES DEVOTEES A DIVINE FEEL_ హంస వాహనంపై ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రాముడు

Vontimitta, 26 March 2018: The devotees on Monday evening experienced a divine feel when they witnessed Lord Sri Rama on Hamsa Vahanam.

On the second day evening, the Lord on Hamsa as vehicle was taken around four mada streets between 8pm and 9:30pm.

DyEOs Smt Goutami, Sri Vijayasaradhi, HDPP Chief Sri Ramakrishna Reddy, Project Officer Sri Ramana Prasad were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హంస వాహనంపై ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రాముడు

మార్చి 26, ఒంటిమిట్ట, 2018: శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ విజయసారధి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ప్రాజెక్టు అధికారి శ్రీ రమణప్రసాద్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.