CM RELEASES 2019 TTD DIARY AND CALENDAR_ టిటిడి 2019 డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

Tirumala, 13 September 2018: The Honourable CM of AP released 2019 TTD Calendar and Diary.

12 sheet Calendar – Rs.100
Big Diary – Rs.130
Small Diary – Rs.100
Table top calendar – Rs.60
SV Calendar (Big) – Rs.15
SP Calendar (Big) – Rs.15
SV & SP (Small) – Rs.10
Telugu Panchangam Calendar – Rs. 20

TTD has printed 16 lakh copies of 12-sheet calendar, Big diaries 8lakh copies, small diaries 2lakh copies, table top calendar 50 thousand copies, SV Big four lakh copies, SP Big 10thousand copiesand SV and SP small six lakh copies and Telugu Panchangam Calendar 2.5lakh copies.

The stock is available in all the TTD sales counters in Tirupati while the pilgrims can also book in online through TTD website from September 14 onwards.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి 2019 డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

సెప్టెంబరు 13, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన గురువారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు టిటిడి ముద్రించిన 2019వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు.

వీటిలో 12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీ, చిన్నడైరీ, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్‌, శ్రీవారి పెద్ద క్యాలెండర్‌, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్‌, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్‌, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ ఉన్నాయి. రూ.100/- విలువైన 12 పేజీల క్యాలెండర్లు 16 లక్షలు, రూ.130/- విలువైన పెద్ద డైరీలను 8 లక్షలు, రూ.100/- విలువైన చిన్నడైరీలు 2 లక్షలు, రూ.60/- విలువైన టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 50 వేలు, రూ.15/- విలువైన శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 4 లక్షలు, రూ.15/- విలువైన శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 10 వేలు, రూ.10/- విలువైన శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 6 లక్షలు, రూ.20/- విలువైన తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీని భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా సెప్టెంబరు 14 నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్‌, శ్రీ అమరనాథరెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, బోర్డు సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.