ABHISHEKAM PERFORMED TO LAKSHMI NARASIMHA

Tirumala, 17 November 2017:Special Abhishekam was performed to Lord Sri Lakshmi Narasimha Swamy located on first ghat road.

In connection with Swati Nakshatram this special fete is observed every year.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Kodanda Rama Rao took part in this abhishekam. Later prasadams were distributed to pilgrims who trekked Alipiri route.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మొదటి ఘాట్‌రోడ్డులోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి వైభవంగా అభిషేకం

తిరుమల 17 నవంబ‌రు 2017;తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం కార్తీక స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో 17వ తేది శుక్రవారంనాడు ఉదయం 10.30 గంటల నుండి 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అభిషేకంలో తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ కోదండరామారావు, ఆర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.