ADDITIONAL ARRANGEMENTS FOR SUMMER RUSH _ వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా టిటిడి మెరుగైన సేవలు

Tirumala, 02 june,2018: On the directions of the TTD EO Sri Anil Kumar Singhal to provide extensive services for the benefit of devotees during summer holidays the TTD has enhanced its arrangements to provide rooms,laddus, darshan etc,in the hill shrine.

The Tirumala JEO Sri KS Sreenivasa Raju is personally supervising and inspecting deployment of personnel at all sectors to ensure that devotees are not put to hardships, Queue lines have been streamlined in the Srivari Temple to avoid wait-time, additional barbers have been roped in at Mini Kalyana katta and Main Kalyana katta and run on 24 hour basis to serve the devotees Vacancy of rooms is made known to devotees via TTD -Radio and also Public address system and buffer stock of laddus are kept ready.

Snacks and anna prasadams, drinking water and butter milk besides milk for children are supplied through out in the queue lines of Narayanagiri, Sarva darshan, Divya darshan and also Vaikuntam -1 and 2 compartments.

Additional cleaners are also pressed into service to keep Tirumala hygienic and clean. Police have also been deployed with vigilance to ensure safety of devotees and also avoid traffic snarls with the support of TTD staff, 2200 srivari sevaks and also scouts and guides.


SPECIAL FOCUS ON ANNA PRADADAMS

During summer days nearly 2.3 lakh annaprasadams are served every day. Daily 1.40 lakh milk, buttermilk, coffee and tea is supplied to all. At the Gali gopuram on the Alipiri walkers path daily 6000 devotees were provided anna Prasadam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా టిటిడి మెరుగైన సేవలు

జూన్‌ 02, తిరుమల 2018 ; వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టిటిడి ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు విశేషంగా సేవలందిస్తున్నారు.

శ్రీవారి ఆలయంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో ఆదనపు స్బిబ్బందిని ఏర్పాటుచేసి 24 గంటలు సేవలు అందిస్తున్నారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాలలోని గదుల వివరాలను ఎప్పటికప్పుడు టిటిడి రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా భక్తులకు తెలియచేస్తున్నారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచారు.

నారాయణగిరి ఉద్యానవనాలలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు మరియు వైకుంఠం – 1, 2 కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను శ్రీవారిసేవకుల ద్వారా నిరంతరం పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆరోగ్యవిభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశారు. టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రత కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. వేసవి సెలవుల్లో విచ్చేసిన లక్షలాదిమంది భక్తులకు టిటిడి అధికారులు, సిబ్బంది, దాదాపు 2,900 మంది శ్రీవారిసేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విశేష సేవలందిస్తున్నారు.

అన్నప్రసాద వితరణ :

వేసవి సెలవుల్లో తిరుమలలో రోజుకు 2.30 లక్షల అన్నప్రసాదాల వడ్డన(సర్వింగ్స్‌) జరుగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో 70 వేలు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సాధారణ రోజుల్లో 60 వేల నుండి 70 వేల వరకు, శని, ఆదివారాల్లో ఒక లక్ష, పిఏసి-2లో 10 వేల వడ్డనలు అందిస్తున్నారు. అదేవిధంగా, సిఆర్‌వో వద్ద 10 వేల నుండి 12 వేల వరకు, పిఏసి-1 వద్ద 10 వేల నుండి 12 వేల వరకు, రాంభగీచా బస్టాండు వద్ద 10 వేల నుండి 12 వేల వరకు, జనతా క్యాంటీన్‌ స్థానంలో ఏర్పాటుచేసిన హెచ్‌విసిలో 10 వేలు, జనతా క్యాంటీన్‌ స్థానంలో ఏర్పాటుచేసిన ఏఎన్‌సిలో 10 వేలు కలిపి ఐదు ఫుడ్‌ కౌంటర్లలో 50 వేలకు పైగా వడ్డనలు చేస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగుల కాంప్లెక్స్‌, బయటి క్యూలైన్లలో కలిపి ఒక రోజుకు 1.40 లక్షల (పాలు, మజ్జిగ, టి, కాఫి) పానీయాలు(బేవరేజెస్‌) అందిస్తున్నారు. అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద ఒక రోజుకు 6 వేల మందికి అన్నప్రసాదాలు, పాలు అందజేస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.