SANATHANA DHARMA AND PHILOSOPHY ARE GUIDELINES TO RIGHTEOUS LIVE- SRI POLA BHASKAR_ సనాతన ధర్మం, ఆధ్యాత్మికత సంపూర్ణ జీవితానికి మార్గదర్శకం : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

GRAND CONCLSION OF SUBHAPRADHAM PROGRAMME

Tirupati, 1 June 2018: Subhapradam training program will help to inculcate values of leading Sanatana Dharma and lay devotional foundation at an young age, says the TTD JEO Sri Pola Bhaskar.

Participating as Chief Guest at the Valedictory of the Shubhapradam training programs at the SV Arts college, Sri Padmavati Women Degree college and PG colleges in Tirupati the JEO said the rich religious and social foundation of India was built on the strong foundation of Sanatana dharma and the secular culture wherein commentaries on Vedas had led to Puranas, Sankeertans etc. The transformation in family system in the Indian society had also led to changes in value system and led loss of basic tenets of sanatana dharmic values.

Confident that the Subhapradam training program would inculcate social values in society He said Hinduism is not a religion but a way of life which taught every one ways of selfless service and righteousness, which was portrayed and nourished by the TTDs religious wing – HDPP.

He said the services of the youth trained in Subhapradam will be utilized as ‘Dharma Pracharakas” by the TTD and urged them to share and spread the awareness they begot with parents and friends as well and prepare an action plan in near future.

He said 3348 students of both Telugu states were trained for a week in the 7 centers of Tirupati from May 26-June 1 and were given accommodation, food and also darshan of Lord Venkateswara.

Earlier Sri Anjaneyulu, OSD of TTD publications outlined the objective of the program and also narrated morals tories from epics like Mahabharata for the advantage of the students.

Dr. Ramana Prasad, Secretary of the HDPP the goal of the program was to inculcate patriotism and also involve them in nation building activities. Later on the students trained in Subhapradam were given certificates and students also presented an attractive cultural and bhakti sangeet program.

The Valedictory of Subhapradam program was conducted in SGS Arts College, SV Junior College, Sri Padmavati Junior College, SV Oriental College, and Sri Padmavathi Polytechnic etc.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సనాతన ధర్మం, ఆధ్యాత్మికత సంపూర్ణ జీవితానికి మార్గదర్శకం : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతిలో ఘనంగా ముగిసిన ”శుభప్రదం”

తిరుపతి, 2018 జూన్‌ 01: శుభప్రదం శిక్షణ తరగతుల్లో సనాతన ధర్మం, ఆధ్యాత్మిక పునాది ద్వారా యువత చిరుప్రాయంలోనే మానవీయ, నైతిక విలువలను ఆకలింపు చేసుకుని సంపూర్ణ జీవితాన్ని గడిపేందుకు మార్గదర్శకం చేస్తుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని ఎస్వీఆర్ట్స్‌ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో శుక్రవారం శుభప్రదం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి జెఈవో ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భారతదేశం సనాతన ధర్మ పునాదులపై నిర్మితమైందని, హైందవ సంస్కృతికి వేదాలు మూలమని పేర్కొన్నారు. వేదాలకు భాష్యం చెప్పడం ద్వారా ఉపనిషత్తులు, పురాణాలు, సంకీర్తనలు ఆవిర్భవించాయన్నారు. మారుతున్న జీవన విధానంలో కుటుంబ వ్యవస్థలో కూడా మౌలికమైన మార్పులు వచ్చాయని, ఈ క్రమంలో నేటితరానికి సనాతన ధార్మిక అంశాలు తెలియడం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేటితరానికి సనాతన ధార్మిక విషయాలను బోధిస్తున్నామని తెలియజేశారు.

హిందూ ధర్మం అనేది మతం కాదని, ఇది జీవన విధానమని, జీవించేటప్పుడు ప్రతి ఒక్కరు ధర్మబద్ధంగా నడుచుకోవాలని తెలియజేస్తుందన్నారు. సనాతన హైందవ ధర్మంలోని మౌలిక విషయాలను టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. ప్రతి విద్యార్థి జ్ఞానం, సత్ప్రవర్తన, ధైర్యం అలవరుచుకుంటే జీవితంలో రాణించవచ్చని, తద్వారా యువతలో సామాజిక స్పృహ పెంపొందుతుందని వివరించారు. భారతదేశంలో భిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలు ఉన్నట్లు, అందులోని మంచిని హైందవ ధర్మం గ్రహిస్తుందని తెలిపారు. శుభప్రదంలో శిక్షణ పొందిన బాల బాలికల సేవలను ”ధర్మప్రచారకులు”గా ఉపయోగించుకుంటామన్నారు. శుభప్రదం శిక్షణ తరగతుల్లో గురువులు నేర్పిన విషయాలను తల్లిదండ్రులతో, మిత్రులతో, బంధువులతో పంచుకోవాలని, ఎలా ఆచరణలో పెట్టాలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,348 మంది విద్యార్థినీ విద్యార్థులకు మే 26 నుండి జూన్‌ 1వ తేదీ వరకు తిరుపతిలోని 7 కేంద్రాలలో వారం రోజుల పాటు శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 7, 8, 9వ తరగతుల విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ఉచితంగా నాణ్యమైన భోజనం, బస కల్పించామన్నారు. విద్యార్థులకు అవకాశం ఉంటే శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.

అంతకుముందు టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో తల్లిదండ్రులకు, గురువు, దైవంను మరవకూడదన్నారు. ఒక వ్యక్తి తత్వం తెలియాలంటే బాల్యం చూడాలన్నారు. భావితరాలకు నైతిక విలువలు అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ శుభప్రదం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం మహాభారతంలోని వివిధ నీతి కథలను విద్యార్థులకు వివరించారు.

అనంతరం టిటిడి హిందూధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌ ప్రసంగిస్తూ భావి భారత పౌరులైన విద్యార్థులు భారతీయ హైందవ సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయ విలువలను నేర్చుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. ఉత్తమ పౌరులను సమాజానికి అందించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

అనంతరం శుభప్రదం కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు సర్టిఫికేట్లను అధికారులు ప్రదానం చేశారు. అంతకుముందు శుభప్రదం శిక్షణ తరగతులకు విచ్చేసిన బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

తిరుపతిలోని ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాల, ఎస్వీ ఓరియంటల్‌ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం శుభప్రదం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వి.పద్మావతి, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల తెలుగు విభాగాధిపతి శ్రీమతి కృష్ణవేణి, టిటిడి ఎపిక్‌స్టడిస్‌ ప్రత్యేకాధికారి శ్రీ దామోదర్‌నాయుడు, హిందూధర్మప్రచార పరిషత్‌ పూర్వ కార్యదర్శి శ్రీ చెంచుసుబ్బయ్య, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

‘శుభప్రదం’ విద్యార్థుల మనోభావాలు

శుభప్రదం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మరియు ఇతర అధికారులతో తమ వారం రోజుల అనుభవాలను పంచుకున్నారు.

శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాల :

రామాయణం, భారత భాగవతాలలోని నీతి కథలు గురించి తెలుసుకున్నా : శ్రీకాంత్‌, నూజివీడు, 8వ తరగతి.

భారత భాగవతాలలోని నీతి కథలు, రామాయణంలోని కుటుంబ వ్యవస్థ, భారతీయ జీవన విధానం గురించి తెలుసుకున్నా. ఇక్కడి గురువులు ప్రతి అంశాన్ని కథల రూపంలో చక్కగా వివరించారు. మాతృమూర్తి గొప్పదనం, మన ఆలయాల వైశిష్ట్యాన్ని చాలాబాగా చెప్పారు. శుభప్రదం తరగతులు ఇంకొన్ని రోజులు నిర్వహిస్తే బాగుంటుంది.

చిన్నకథలు, ‘పురాణాలు – కుటుంబజీవనం’ చాలా బాగుంది : శ్రీకాంత్‌, మెదక్‌,7వ తరగతి.

చిన్న కథలు, పురాణాల ద్వారా కుటుంబ జీవనం, ఆనాడు ఉమ్మడి కుటుంబాలు చాలా బాగుండేది. ఈ తరగతుల ద్వారా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. వచ్చే ఏడాది కూడా అవకాశం కల్పిస్తే రావాలని ఉంది.

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పి.జి కళాశాల :

తల్లిదండ్రులు, గురువులకు పాదాభివందనం చేస్తా : హీళాశ్రీ, కరీంనగర్‌, 9వ తరగతి.

మా ఇంటి దగ్గర ఉన్న సార్‌ ద్వారా ఈ శిక్షణ తరగతుల గురించి తెలుసుకున్నా. ఇక్కడ తల్లిదండ్రులు, గురువుల గొప్పదనాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ప్రతి రోజు తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనం చేస్తాను. పురాణాలు, వేదాలు ద్వారా చాలా మంచి విషయాలు తెలియచేశారు. ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితకాలం ఆచరిస్తాను.

నైతిక విలువలు నేర్పారు : జ్యోతిర్మయి, కిళ్ళిపాళ్యం, శ్రీకాకుళం జిల్లా, 7వ తరగతి.

జీవితంలో ఎదిగేందుకు అవసరమైన నైతిక విలువలను చక్కగా నేర్పారు. ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. చక్కటి భోజనం అందించారు. ఇంట్లో ఉన్నట్టే ఉంది.

నేర్చుకున్న విషయాలు స్నేహితులకు తెలియజేస్తా : వర్షిత, తిరుపతి, 8వ తరగతి.

మన కట్టుబొట్టు వెనకున్న విజ్ఞానాంశాలు, పురాణకథల్లోని నీతి, సత్యం, నిగ్రహం, భగవంతుని గొప్పదనం గురించి చక్కగా బోధించారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. ఈ విషయాలను ఆచరిస్తే జీవితం ఎంతో బాగుంటుంది. వీటి గురించి స్నేహితులందరికీ తెలియజేస్తా.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.