ADDITIONAL Rs 300 TICKETS ONLINE – JEO TIRUMALA_ భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో అదనంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు :టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 10 February 2018: TTD Joint Executive Officer Sri KS Sreenivasa Raju today said that more Rs.300 tickets will be provided online for benefit of devotees.

The JEO told reporters at Tirumala that online facility is provided for Rs.300 tickets so that devotees can book their visit and darshan in advance. Since the devotees rush between February 1-17 is low 17,000 tickets of Rs 300 is released online as against 25,000 online tickets per week. For devotees benefit on Friday, Sundays- 4000 more tickets and on Monday, Tuesday and Wednesdays- 3000 tickets of Rs.3000 were released online. Devotees with Rs.300 tickets can beget darshan of Lord Venkateswara within two hours, he added.

With regard to release of April quota of Rs, 300 tickets online, the same will be done in a day or two he said adding that the delay was due to Panchangam. The online quotas for May 2018 were activated by Saturday 11am.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో అదనంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు :టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఫిబ్రవరి 10, తిరుమల, 2018: భక్తుల సౌకర్యార్థం రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అదనంగా కేటాయిస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలో శనివారం జెఈవో మీడియాతో మాట్లాడుతూ రూ.300/- దర్శన టికెట్లను నిర్దేశిత కోటాలో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా కొన్ని నెలల ముందుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు తిరుమలకు భక్తులు తక్కువగా వస్తారని, ఈ సమయంలో వారానికి 17 వేలు చొప్పున అదనంగా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ప్రస్తుతం వారానికి లక్షా 25 వేల టికెట్లు జారీ చేస్తున్నామని, శుక్ర, ఆదివారాల్లో 4 వేలు, సోమ, మంగళ, బుధవారాల్లో 3 వేల టికెట్లు అదనంగా కేటాయిస్తామని తెలిపారు. రూ.300/- టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు రెండు గంటలలోపే దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

పంచాంగం గురించి వేచి ఉండడం వల్ల ఆన్‌లైన్‌లో రూ.300/- దర్శన టికెట్ల ఏప్రిల్‌ నెల కోటా విడుదల కాస్త ఆలస్యమైందని, ఒకట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని జెఈవో తెలిపారు. మే నెలకు సంబంధించి గదుల ఆన్‌లైన్‌ కోటాను శనివారం ఉదయం 11 గంటల నుండి భక్తులకు అందుబాటులో ఉంచినట్టు వివరించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.