VENKANNA RIDES PALLAKI IN MOHINI AVATRA_ మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు

Tirupati, 10 February 2018: On Day 5 of the Annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram, Lord Venkanna blessed devotees in Mohini avatar seated on Palanquin all along mada streets. His entourage included caparisoned elephants; Chakka bhajan teams, Kolatas, and Kerala drum beaters as devotees offered camphor harati at every step.

Venkanna as Mohini nursing a Bala Krishna was a feast for spiritually minded devotees who thronged the temple precincts for blessings and darshan.

Later in the evening the unjal seva and the prestigious and auspicious garuda sea will mark the milestone event of the annual Brahmotsvam.

Garuda vahana seva and darshan of Lord riding on his pet vehicle of Garuda is said to be a lifetime achievements for the pious. The TTD has made elaborate arrangements for security, water, snacks and anna prasadams for the devotees coming for the epitome event of the Brahmotsavams.

DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, Exe Engineer Sri Manohar, DyEE Sri Ramamurthy, Chief kankana bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraju, AVSO Sri Ganga Raju and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు

తిరుపతి,2018 ఫిబ్రవరి 10: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం గోవిందుడు మోహినీ అవతారంలో పల్లకీలో, తిరుచ్చిపై చిన్ని కృష్ణుడు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పల్లకీ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై, తిరుచ్చిపై చిన్న కృష్ణుడు భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, ఇఇ శ్రీ మనోహరం, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీ రంగాచార్యులు, ఏఈ శ్రీ నాగరాజు, ఎవిఎస్వో శ్రీ గంగారాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.