ADDNL.EO REVIEWS ON PARAKAMANI _ ప‌ర‌కామ‌ణి విభాగంపై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష

Tirumala, 1 Aug. 20: The Additional EO Sri AV Dharma Reddy held a review meeting with bankers on the Parakamani activity.

The meeting was held at Annamaiah Bhavan in Tirumala on Saturday. He said in the last one year about 52crores of coins were lifted by the banks and the coin currency accumulation which was pending since long time was almost cleared. 

However, due to ongoing COVID 19 crisis, about 4.33crore coins got accumulated in the last four months period and sought the bankers to sort them out once the situation.

Parakamani DyEO Sri Venkataiah and Branch Managers of various banks were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప‌ర‌కామ‌ణి విభాగంపై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష

ఆగస్టు 01, తిరుమల 2020: టిటిడి ప‌ర‌కామ‌ణి విభాగంపై అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శనివారం తిరుమ‌ల‌లోని అన్నమయ్య భవనంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా పరకామణి విభాగంలో నిల్వ ఉన్న నాణేలు తరలించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అద‌న‌పు ఈవో చర్చించారు. కోవిడ్ -19 లాక్ డౌన్ వల్ల నిల్వ ఉన్న రూ.4.33 కోట్లు (4 కోట్ల 33 ల‌క్ష‌ల రూపాయలు) విలువైన నాణేలను తరలించడంపై బ్యాంకర్లతో సమీక్షించారు.

కాగా, కొన్నేళ్లుగా పరకామణిలో నిల్వ ఉన్న నాణేల్లో గత సంవత్సర కాలంలో దాదాపు రూ.51.80 కోట్ల విలువైన నాణేలను టిటిడి వివిధ బ్యాంకులకు అప్పగించింది.

ఈ సమావేశంలో ప‌ర‌కామ‌ణి డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, వివిధ బ్యాంకుల మేనేజర్లు,‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.