ADMISSIONS INTO TTD JUNIOR COLLEGES _ అక్టోబరు 28న టిటిడి జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు
TIRUMALA TIRUPATI DEVASTHANAMS
ADMISSIONS INTO TTD JUNIOR COLLEGES
Tirupati, 25 October 2021: TTD will conduct spot admissions into its Junior Colleges on October 28 by 9 am in the respective colleges for the academic year 2021-22.
In the morning, preference will be given to the children of TTD Regular and Outsourcing employees, those who absented during first and second phase counsellings, locals, pupils who scored GPAs between 9.7 and 10.
In the afternoon, admissions will be conducted for those who scored 9.6GPA and less.
Those who have already applied through http://admissions.tirumala.org alone have to appear for spot admissions with relevant certificates and fees for admission into SV Junior College and Sri Padmavathi Junior College.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 28న టిటిడి జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి, 2021 అక్టోబరు 25 ;టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను అక్టోబరు 28న ఉదయం 9 గంటలకు ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు టీటీడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. టిటిడిలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు, మొదటి, రెండో విడతలో కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు, తిరుపతిలోని స్థానికులు, జిపిఏ 10 నుండి 9.7 వరకు ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు జిపిఏ 9.6 కంటే తక్కువ ఉన్న విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహిస్తారు.
ఇదివరకే http://admissions.tirumala.org ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, సంబంధిత కళాశాలలో సీట్లు మాత్రమే కావాల్సివారు, ధ్రువీకరణపత్రాలు, ఫీజులతో నేరుగా సంబంధిత జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.