AGAMAS FOR UNIVERSAL WELL-BEING SEMINAR _ వేద విశ్వవిద్యాలయంలో ఆగమాలు లోకహితంపై సదస్సు
TIRUPATI, 19 JANUARY 2023: A two-day National Seminar on the Agamas for universal well-being was inaugurated in SV Vedic University in Tirupati on Thursday.
Dr T Brahmacharyulu, the Convenor of the Seminar and Agama department Head, explained about the importance of the Seminar.
Later Madras Sanskrit College Professor Sri Arunasundara Sivacharya said, Agamas are the hereditary of the ancient Hindu Sanatana Dharma. He said the Agamas explained on various activities related to the temple structure, Gopuram, rituals, mula vigraham etc.forumulated many National Sanskrit University VC Prof GSR Krishnamurty said that the temple structure is an embodiment of Agama, Silpa, Sangeeta, Nritya, Sahitya, Jothisya, Vastu, Yoga Shastras.
SVVU VC Prof Rani Sadasiva Murthy said all the temple related information are treasurised in Agama Shastras.
Scores of scholars from across the country participated in this National seminar. Registrar Dr Radhesyam and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వేద విశ్వవిద్యాలయంలో ఆగమాలు లోకహితంపై సదస్సు
తిరుపతి 19 జనవరి 2023: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు జరుగనున్న జాతీయ ఆగమ సదస్సు గురువారం ప్రారంభమైంది.
ఆగమ విభాగాధ్యక్షులు సదస్సు కన్వీనర్ డాక్టర్ టి. బ్రహ్మాచార్యులు సదస్సు యొక్క లక్ష్యమును వివరించారు .
అనంతరం మద్రాసు సంస్కృత కళాశాల ఆచార్యులు అరుణసుందరశివాచార్య మాట్లాడుతూ ఆలయాలు భారత సనాతన సాంప్రదాయ వారసత్వ సంపద అన్నారు. ప్రాముఖ్య పురాతన ఆలయాలు ఎలా జీర్ణోద్ధారణ చేయాలి, విమాన గోపురందోషమైతే ఎలా నిస్కృతి చేయాలి, బింబము దోషమైతే ఎటువంటి పరిచర్య చేయాలి అనే వివరాలు వైఖానస,,పాంచరాత్ర, శైవాగములలో ఎలా ఉన్నదో తెలిపారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్సార్ కృష్ణమూర్తి మాట్లాడుతూ , ఆగమ, శిల్ప, సంగీత, నృత్య, సాహిత్య, జ్యోతిష్య,వాస్తు ,యోగ శాస్త్రముల సమాహారమే దేవాలయం అన్నారు. లోకహితం కోసం ఆగమంలో అనేక విషయాలు చెప్పారని, అటువంటి ఆగమశాస్త్రము ఆలయ శిల్పకళా శోభితముగా ప్రాకార సహితముగా నిర్మించాలన్నారు . అలా నిర్మితమైన ఆలయంలో దోషము ఏర్పడిన , నవీకరణ చేయాల్సిన అవసరం ఏర్పడిన బాలాలయమును ఆచరించాలని ఆయన చెప్పారు. అటువంటి బాలాలయ ప్రక్రియ పై జాతీయ సదస్సు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
వేద విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య.రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఆగమాల్లో
ఆలయ సంబంధ విషయాలన్నీ సమగ్రంగా చెప్పారని తెలిపారు .
దేశంలోని అనేక రాష్ట్రాల నుండి పండితులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎ.వి,రాధేశ్యాం కోఆర్డినేటర్స్ డా. రాజేష్ కుమార్ డా.నీలకంఠం శివాచార్య డా. జి రామకృష్ణ చార్యులు ఎఫ్ఓ అంజి రెడ్డి పాల్గొన్నారు .
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది