ALARMELMANGA MESMERIZES DEVOTEES AS ”JAGANMOHINI” _ పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ
TIRUPATI, 04 DECEMBER 2021: Goddess Padmavati who is popularly known as Alarmelmanga mesmerized devotees in the sizzling Mohini Avatara on the finely decked Pallaki.
As a part of the ongoing annual Kartika brahmotsavams at Tiruchanoor on Saturday morning, the Goddess in the guise of the ‘celestial beauty’, Jaganmohini, charmed devotees.
Both the senior and junior Pontiffs of Tirumala, Chandragiri Legislator Dr C Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, Pancharatra Agama Advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy, Deputy EO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ
తిరుపతి, 2021 డిసెంబరు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జరిగింది.
ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.