INSTALL CC CAMERAS IN TIRUMALA BY THE FEB END-EO_ తిరుమలలో ఈ నెలాఖరులోపు సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 5 February 2018: As a part of enhancing the security cover in Tirumala, the setting up of advanced CC Cameras in and around Tirumala temple should complete by the end of February, said TTD EO Sri Anil Kumar Singhal.

The senior officers review meeting was held at Conference Hall in TTD Administrative Building in Tirupati on Monday. The EO directed the officials concerned to speed up the installation of CC cameras in the hill town. He later instructed the officials to strengthen the FMS call centre activity by solving the issues without delay. The EO directed the concerned to set up water taps in Alipiri footpath route to grow plants and also instructed the electrical wing officials of TTD to replace the pedestal fans in Vaikuntham queue complex with noiseless giant ceiling fans. Similarly he asked the officials to identify the congested lines and make necessary amendments for the convenience of the pilgrims.

The EO directed the Revenue officials to modify and strengthen the Demand Collection Balance (DCB) system while dealing with Hotels, rental shops, hawkers licences in Tirumala.

On e-Office, the EO directed the finance wing officials to implement the same soon in its department and instructed the EDP to install licensed software for better network.

The EO later directed the Engineering wing officials to complete the developmental works of Upparapalle Circle as a part of the beautification of Tirupati City. “The office in Friday Gardens at Tiruchanoor should complete by May”, he added.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri O Balaji and other senior officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో ఈ నెలాఖరులోపు సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఫిబ్రవరి 05, తిరుపతి, 2018: తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న మొదటి దశ సిసి కెమెరాల ఏర్పాటు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌కు భక్తుల నుండి వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అలిపిరి కాలినడక మార్గంలో మొక్కల పెంపకానికి అనుగుణంగా నీటి కొళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తుల సౌకర్యార్థం పెడస్టల్‌ ఫ్యాన్ల స్థానంలో శబ్దం లేని వేగంగా గాలి వీచే ఫ్యాన్లను అమర్చాలని సూచించారు. క్యూలైన్లలో ఇరుకుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. టిటిడి ఆధ్వర్యంలోని దుకాణాల అద్దె, హోటళ్ల లైసెన్స్‌, హాకర్‌ లైసెన్సు తదితర వాణిజ్యపరమైన కార్యకలాపాలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు డిసిబి(డిమాండ్‌ కలెక్షన్‌ బ్యాలెన్స్‌) విధానాన్ని ఆధునీకరించాలన్నారు.

టిటిడిలో ఇప్పటికే పలు విభాగాల్లో ఈ-ఆఫీస్‌ విధానం అమలవుతోందని, ఆడిట్‌ విభాగంలోనూ త్వరితగతిన అమలుచేయాలని ఆదేశించారు. టిటిడిలోని అన్ని విభాగాల్లో లైసెన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలని ఇడిపి అధికారులకు ఈవో సూచించారు. తిరుపతి సుందరీకరణలో భాగంగా ఉప్పరపల్లె సర్కిల్‌ను అభివృద్ధి చేయాలని ఈవో ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపుతోటలో కార్యాలయ భవనాన్ని మే నెలలోపు పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.