ALL PROJECTS REVIEW MEETING HELD _ ధార్మిక ప్రాజెక్టుల కార్యకలాపాలపై టిటిడి ఈవో సమీక్ష

TIRUPATI, 17 FEBRUARY 2023: TTD EO Sri AV Dharma Reddy along with JEO (H&E) Smt Sada Bhargavi held a review meeting on all projects of TTD on Friday.

The meeting was held at the Chambers’ of EO in the TTD Administrative Building. After powerpoint presentation by respective project heads, the EO directed them to come out with a detailed yearly action plan.

He also reviewed on Managudi, Kalyanamastu, Gudiko Gomata, Astadasa Puranas, Annamacharya Sankeertans, Dasa Padas, Alwar Divya Prabandha Parayanms, Chaturveda Havanam and many other religious programs.

The EO directed JEO to hold a detailed review meeting with each project on pending issues with respect to artistes, payments, recruitments etc. if any and settle them as soon as possible.

All Projects Project Officer Smt Vijayalakshmi, Annamacharya Project Director Sri Vibhishana Sharma, AEO HDPP Sri Sriramulu, Program Officer Smt Vijayalakshmi were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధార్మిక ప్రాజెక్టుల కార్యకలాపాలపై టిటిడి ఈవో సమీక్ష

తిరుపతి, 2023 ఫిబ్రవరి 17: ధార్మిక ప్రాజెక్టుల కార్యకలాపాలపై టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం జెఈవో శ్రీమతి సదా భార్గవితో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది.

ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కార్యకలాపాలను తెలియజేశారు. ధార్మిక కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్‌ను రూపొందించాలని ఈవో సూచించారు.

అనంతరం మనగుడి, కల్యాణమస్తు, గుడికో గోమాత, అష్టాదశపురాణాలు, అన్నమాచార్య సంకీర్తనలు, దాసపదాలు, ఆళ్వార్ల సాహిత్యం, చతుర్వేద హవనాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

అయా ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, నియామకాలు, చెల్లింపులు, కళాకారుల సమస్యలపై వేరువేరుగా సమీక్షలు నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని జెఈవోకు ఈవో సూచించారు.

ఈ సమీక్షలో ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీమతి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. విభీషణశర్మ, హెచ్‌డిపిపి ఏఈవో శ్రీ శ్రీరాములు, ప్రోగ్రాం అధికారి శ్రీమతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.