ALL SET FOR AVATAROTSAVAMS IN SRI PAT_ శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Tirupati, 2 July 2018: The annual Avatara Mahotsavams of Sri Sundera Raja Swamy, a sub-temple in Tiruchanoor, will be observed from July 3 to 5 and the arrangements for the same have been completed by the temple officials.

There will be special rituals in connection with this auspicious fete. Every day, Sahasra Namarchana to Sri Sundera Raja Swamy will be rendered between 10.30am and 12 noon followed by Kalyanotsavam to Ammavaru.

Every day afternoon between 2pm and 3.30pm, Abhishekam is performed to Sri Sundera Raja Swamy in Sri Krishna Mukha Mandapam followed by Unjal Seva between 5.15pm and 6.15pm.

On first day evening the lord takes ride on Pedda Sesha Vahanam.

In view of this festival, Sahasra Deepalankara Seva has been cancelled on Tuesday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 జూలై 02: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసుందరరాజ స్వామివారి ఆలయంలో జూలై 3 నుండి మూడు రోజుల పాటు జరుగనున్న వార్షిక అవతార మహోత్స వాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం శ్రీ సుందరరాజస్వామివారికి సహస్రనామార్చన, ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీక ష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు ఊంజల్‌ సేవ జరుగుతుంది. శ్రీసుందరరాజస్వామివారు మొదటిరోజు పెద్దశేష వాహనంపై, రెండో రోజు హనుమంత వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఈ ఉత్సవాల కారణంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు సహస్రదీపాలంకరణసేవను రద్దు చేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.