EO INSPECTS FOUR MADA STEETS_ తిరుమలలో భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అభివృద్ధిపనులు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 2 July 2018: TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the four mada streets in Tirumala on Monday evening.

The instructed the engineering officials to construct additional toilets in the Mada streets and in Narayanagiri Gardens as per the master plan. He instructed the electrical wing officials to enhance lighting in the Mada streets for the sake of the pilgrims.

Later speaking to media persons, the EO said Rs.26cr has been sanctioned towards the implementation of master plan. As a part of it, today we have inspected the four mada streets and identified some areas where we can construct the additional toilets. The designers from Mumbai also given their opinions over the construction of additional toilets. So we are contemplating to come out with an appropriate plan that will suffice the needs of the pilgrims”, he added.

CE Sri Chandrasekhar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Venkateswarulu, CVSO In-charge Sri Sivakumar Reddy, Health Officer Dr Sermista were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అభివృద్ధిపనులు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జూలై 02, తిరుమల 2018: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం నాలుగు మాడ వీధులలో భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. టిటిడి ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి సోమవారం సాయంత్రం తిరుమలలోని నాలుగు మాడ వీధులలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో ప్రత్యేక పర్వదినాలైన రథసప్తమి, బ్రహ్మూెత్సవాల సందర్భంగా అధికరద్దీ ఉన్న నేపధ్యంలో భక్తుల సౌకర్యార్థం మరిన్ని మరుగుదొడ్లు నిర్మించనున్నాట్లు తెలిపారు. తిరుమల మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా మాడ వీధులు, నారాయణగిరి ఉద్యానవనాలు, ప్రధాన ప్రాంతాలలో మరుగుదొడ్లు నిర్మించనున్నాట్లు వివరించారు. ఇందుకోసం ముంబాయికి చెందిన ప్రముఖ డిజైనింగ్‌ సంస్థతో సంప్రదింపులు పూర్తి చేసి, వారి సలహాలు, సూచనలతో పనులు ప్రారంభిస్తున్నట్లు తెలియచేశారు. ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు రెట్టింపు సంఖ్యలో నిర్మిస్తామన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌, ఆరోగ్య విభాగం అధికారులతో కలిసి నాలుగు మాడ వీధులు పరిశీలించామన్నారు.

అంతకుముందు ఆలయ నాలుగు మాడ వీధులలో లైటింగ్‌ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇ ఎలక్ట్రికల్‌ శ్రీ వెంకటేశ్వర్లును ఆదేశించారు. అదేవిధంగా మాడ వీధులు, గ్యాలరీలు, ప్రధాన కూడళ్లలో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు తీసుకోవాలని, మరుగుదొడ్లలలో నిరంతరాయంగా నీటి సరఫర, ఎగ్జ్‌స్ట్‌ ఫ్యాన్‌లు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్టను ఆదేశించారు.

అనంతరం ఈవో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టిటిడి భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యత, ఇతర సౌకర్యాలను గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. టిటిడి అందిస్తున్న అన్నప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.