ANANTA PADMANABHA VRATAM ON SEP 12_ సెప్టెంబరు 12న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

Tirumala, 11 Sep. 19: Ananta Padmanabha Vratam will be observed in Tirumala on Thursday.

As a part of this fete, the Sudarshana Chakrattalwar will be brought to Swami Pushkarini and will be rendered Abhishekam during the early morning hours.

After that, the anthropomorphic form of Lord will return to the temple.
Temple officials and priests will take part in this fete.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 12న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

తిరుమల, 2019 సెప్టెంబ‌ర్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్ల చతుర్థశి పర్వదినాన అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 12వ తేదిన అనంత పద్మనాభ వ్రతాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.

కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణికి చెంతకు అర్చకులు ఆగమోక్తంగా తీసుకువెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 6.00 నుండి 7.00 గంట‌ల నడుమ ఘనంగా జరుగనుంది. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.

ఈ కార్య‌క్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.