KOUSTUBHAM COUNTER SHIFTED_ కౌస్తుభంలో నూత‌న గ‌దుల కేటాయింపు కేంద్రం ప్రారంభం

Tirumala, 11 Sep. 19: The allotment counter in Koustubham Rest House in Tirumala has been shifted from Western side to Eastern side keeping in view the convenience of the pilgrims.

In this connection, special puja was performed before commencing the allotment of rooms to the pilgrims on Wednesday.

Special Grade DyEO Smt Parvati, AEO Sri AVL Narayana, Superintendent Sri Ramachandra and other staffs were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కౌస్తుభంలో నూత‌న గ‌దుల కేటాయింపు కేంద్రం ప్రారంభం

తిరుమల, 2019 సెప్టెంబర్ 11: తిరుమ‌ల‌లోని కౌస్తుభం వ‌స‌తి స‌మూదాయంలో 2వ అంత‌స్తులో నూత‌నంగా ఏర్పాటు చేసిన గ‌దుల కేటాయింపు కౌంట‌రు నందు బుధ‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి ప్రారంభించారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం కౌస్తుభంలోని 3వ అంత‌స్తులో(ప‌డ‌మ‌ర వైపు) గ‌ల గ‌దుల కేటాయింపు కేంద్ర‌న్ని 2వ అంత‌స్తు (తూర్పు వైపు)కు మార్చ‌డ‌మైది.

ఈ కౌంట‌ర్ నందు మంత్రులు, పార్ల‌మెంటు స‌భ్యులు, శాస‌న స‌భ్యులు, శాస‌న మండ‌లి స‌భ్యులు, మీడియా ప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై ప్ర‌తి రోజు 230 గ‌దులు కేటాయిస్తున్న విష‌యం విదిత‌మే. కావున భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

పూజ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ నారాయ‌ణ‌, సూప‌రింటెండెంట్ శ్రీ రామ‌చంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.