TTD EO THROWS LIGHT ON VARIOUS SOCIO-RELIGIOUS ACTIVITIES _ ఆలయ నిర్వహణలో టీటీడీ ప్రపంచానికే దిక్సూచి – వారణాసిలో ఆలయాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మేళనంలో టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి

CONVICTION AND DEVOTION IS MUST FOR ADMINISTRATORS OF TEMPLES-TTD EO

LAURELS POUR IN FOR TTD PRESENTATION

RSS CHIEF MOHAN BHAGAT LAUDS TTD ACTIVITIES UNDER SRIVANI TRUST

TIRUMALA, 22 JULY 2023: “A strong conviction, goal, zeal and devotion of administrators will definitely help in the development of the administration of temples”, asserted TTD EO Sri AV Dharma Reddy.

He was addressing a galaxy of administrators belonging to various Hindu temples from over 30 countries during the three-day Maha Kumbh of Temples-International Temples Convention and Expo held at Rudraksh Convention Centre in Varanasi in the state of Uttar Pradesh which commenced on Saturday.

The PowerPoint presentation on the wide range of socio-religious activities besides the millions of pilgrim footfall to the famed Hill shrine of Tirumala by TTD EO in a befitting manner caught the attention of over 1600 Hindu temple administrators across the world.

Initially, an impressive Audio-Visual lasting for about half an hour was played covering all the activities of TTD including darshan, Temples, education, health, Annaprasadam, tonsuring, Srivari Seva, ancient learning vedic studies, fine arts institutions, series of religious activities for Dharmic promotion, Vigilance and Security, forests, gardens, energy consumption, plastic-free measures etc.

Later the EO explained in detail for an hour about the various darshan patterns which included 60% on free basis for the common pilgrims, Annaprasadam, Jalaprasadam, tonsuring, accommodation, educational institutions including special courses like fine arts, Vedic education, sculpture college, Balamandir etc.,  about 1600 operations including four Open Heart Surgeries successfully performed on infants and children in Sri Padmavathi Children’s Heart Centre, SVIMS, BIRRD hospitals, Aswini-Apollo Cardiac in Tirumala,  about SVBC, Gosala and related Gosamrakshana programmes, Go Adharita Naivedyam, Dry flower technology, new initiatives including introduction of eco-friendly buses to transport pilgrims, paperless administration with advance IT initiatives etc. in an elaborated manner amidst the huge round of applause from the audience.

Adding further the EO said the “A temple is not just a place of worship but is a Centre for education, health, Vedic studies, spiritual activities, Annadanam and many more. When these kinds of holistic things are done by the temples, people visit in large numbers”. 

Elaborating further the EO added, We have 66 departments with a strong and dedicated workforce of nearly 24,500 including 7000 regular employees. “Introduction of new infrastructure adopting the latest technology has enabled us to meet the ever-increasing demand from the pilgrims according to the time and today we are providing hassle-free darshan to over 80 thousand to 90 thousand pilgrims on a day, producing nearly 3.5lakh laddus every day and providing Annaprasadam to nearly 2lakh pilgrims per day in all our centres. The entire TTD administration is paperless and everything is computerized with absolute transparency.

The EO also explained in detail about Srinivasa Kalyanams and Venkateswara Vaibhavotsavams, Gudiko Gomata program, the commencement of Parayanams with Visuchika Maha Mantram ever since the erupt of Covid pandemic and how they have won global devout attention, Anjanadri-Akasaganga-Lord Hanuman Birth Place, temples constructed under the funds from SRIVANI Trust and how the menace of middlemen is totally weeded out with the introduction of SRIVANI providing one time VIP break darshan privilege to the donor, Srivari Seva Voluntary Service etc.

Concluding his hour-long speech the EO said “Efficient management techniques by the successive administrators always helped TTD to give the best facilities to its pilgrims. If the basic amenities like food, sanitation, spirituality and ambience are provided in a healthy environment, then automatically devotees visit that temple and hence today TTD has set a role model to other temple managements in pilgrim-friendly measures, he affirmed.

Earlier, the Rastriya Swayamsevak Sangh (RSS) Chief Sri Mohan Bhagat in his speech lauded TTD for taking up the construction of new temples in backward areas and renovation of dilapidated temples in a big way under the funds of SRIVANI Trust and poured in laurels on various other TTD spiritual and social activities.

Later Sri Prasad Minesh Lad, Chairman of the convention and Sri Girish Kulkarni, Founder of the Temples’ Connect felicitated the TTD EO Sri AV Dharma Reddy with a shawl and a memento.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆలయ నిర్వహణలో టీటీడీ ప్రపంచానికే దిక్సూచి

– వారణాసిలో ఆలయాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మేళనంలో టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి

తిరుమల, 2023 జూలై 22: ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి వెల్లడించారు . ఆలయ నిర్వాహకుల దృఢ నిశ్చయం, లక్ష్యం, చిత్తశుద్ధి, భక్తి దేవాలయాల పరిపాలన, అభివృద్ధికి ఖచ్చితంగా ఉపయోగపడతాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలోని రుద్రాక్ష్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం నుండి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో ఈవో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 30 దేశాలకు చెందిన వివిధ హిందూ దేవాలయాల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిచెందిన పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ కల్పిస్తున్న వసతులు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన పాలనా వ్యవస్థపై ఈవో అరగంటపాటు అందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వాహకుల దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా ఈవో ప్రసంగిస్తూ యాత్రికులకు శ్రీవారి దర్శనం, వసతి, తలనీలాలు, లడ్డూల తయారీ తదితర అంశాల్లో టీటీడీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. సమర్థ నిర్వహణ వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఆలయం పవిత్రంగా ఉండాలని, చక్కటి పరిశుభ్రత పాటించాలని, భక్తులకు మంచి దర్శనం, వసతులు కల్పించాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, అన్నదానం, వేద సంస్కృతి పరిరక్షణ చేపట్టాలన్నారు. టీటీడీ ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని వివరించారు. స్విట్జర్లాండ్‌, సింగపూర్‌ లాంటి దేశాల తరహాలో తిరుమలలో పారిశుద్ధ్యం ఉందన్నారు.

పురాతన ఆలయాల పునరుద్ధరణకు, మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్టును ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు 170 పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించామని, 300 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, దాదాపు రెండు వేల ఆలయాలు వివిధ దశలో ఉన్నాయని చెప్పారు. భక్తులు దాదాపు 900 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేశారని, ఇప్పటివరకు 330 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించిన దాతలకు ఒక బ్రేక్‌ దర్శనం టికెట్‌ అందజేస్తున్నామన్నారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఏడాదిన్నర కిందట ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు 1600కు పైగా గుండె శస్త్రచికిత్సలు, నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. చిన్నపిల్లలకు కార్డియాలజీతోపాటు ఇతర విభాగాలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని, డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

టీటీడీ ఆధ్వర్యంలో 71 ఆలయాలు, 11 ట్రస్టులు, 14 ఆసుపత్రులు, 35 విద్యాసంస్థలు, 9 వేద పాఠశాలలు, నాలుగు గోశాలలు, 300 కళ్యాణ మండపాలు, 10 ధార్మిక సంస్థలు, నాలుగు భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌, అనాధ పిల్లల కోసం బాలమందిరం, రెండు మ్యూజియంలు ఉన్నాయన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే తోటి భక్తులకు సేవలందించేందుకు 2000 సంవత్సరంలో శ్రీవారి సేవ విభాగాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు 14 లక్షల మంది సేవకులు నమోదయ్యారని తెలిపారు. ఇతర ఆలయాలు కూడా శ్రీవారి సేవ వ్యవస్థను ప్రారంభించాలని సూచించారు. శ్రీవారికి నైవేద్యం కోసం రసాయనాలు, పురుగుమందులు లేని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోస్తున్నామని తెలిపారు. ఇతర ఆలయాల్లో కూడా ఈ ఉత్పత్తులను వినిగించాలని కోరారు.

కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి శ్రీనివాస కళ్యాణం, వేంకటేశ్వర వైభవోత్సవాలు, గుడికో గోమాత కార్యక్రమం, విషూచిక మహామంత్రంతో పారాయణాలు ప్రపంచ భక్తుల దృష్టిని ఏ విధంగా ఆకర్షించాయో వివరించారు.

అంతకుముందు, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ శ్రీ మోహన్‌ భగత్‌ తన ప్రసంగంలో శ్రీవాణి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణను పెద్దఎత్తున చేపట్టినందుకు టీటీడీని ప్రశంసించారు. టీటీడీ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. అనంతరం ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డిని సమ్మేళనం చైర్మన్‌ శ్రీ ప్రసాద్‌ మినేష్‌ లాడ్‌, టెంపుల్స్‌ కనెక్ట్‌ వ్యవస్థాపకులు శ్రీ గిరీష్‌ కులకర్ణి శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.