ANDAL UTSAVAM IN SRI GT_ ఆగస్టు 4 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం

Tirupati, The Tiruvadipudi Utsavam of Andal Sri Godai in Sri Govindaraja Swamy temple will be observed from August 4 to 13 in a religious manner.

During these days, there will be tirumanjanam of Ammavaru between 6am to 6:30am and procession in four mada streets between 5:30pm to 6:30pm.
On August 10 there will be Sukravara Asthanam while on the last day on August 13 there will be snapana tirumanjanam to Swamy and Andal and later they were taken to Alipiri and Asthanam is performed between 4pm and 8pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 4 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం

తిరుపతి, 2018 ఆగస్టు 03: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుండి 13వ తేదీ వరకు ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

ఆగస్టు 10వ తేదీ సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతోపాటు శుక్రవార ఆస్థానం నిర్వహిస్తారు. ఆగస్టు 13వ తేదీన ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుండి 8.00 గంటల వరకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.