PAVITROTSAVAMS IN KRT FROM AUGUST 7 TO 9_ ఆగస్టులో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 3 August 2018: The annual Pavitrotsavams in Sri Kodanda Rama Swamy temple will be observed from August 7 to 9.

The other important days includes abhishekam on August 4, 11, 18 and 25.

Sahasra Kalasabhishekam on August 11 and Astottara Sata Kalasabhishekam on August 26.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టులో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2018 ఆగస్టు 03: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఆగస్టు 4, 11, 18, 25వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– ఆగస్టు 6న ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

– ఆగస్టు 7 నుండి 9వ తేదీ వరకు స్వామివారి పవిత్రోత్సవాలు

– ఆగస్టు 11న అమావాస్య సందర్భంగా ఉదయం 6.00 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

– ఆగస్టు 26వ తేదీ పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.