ANKURARPANAM FOR PUSHPAYAGAM AT SRI GT_ జూన్‌ 20న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ

Tirupati, 19 June 2018: Ankurarpanam for Pushpayagam in Sri Govinda Raja Swamy temple will be performed on June 20.

The floral ritual will be observed on June 21. This is a festival which ia usually observed as pardon seeking festival to commissions and commissions done by religious staff members or non religious staffs and even by devotees either knowingly or unknowingly during annual Brahmotsavams which was observed from May 21 to 29.

Temple officials will take part in the seed sowing festival that will be observed in Yagahala of the temple on Wednesday evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 20న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ

తిరుపతి, 2018 జూన్‌ 19: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్‌ 21వ తేదీన పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూన్‌ 20వ తేదీ బుధవారం సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

మే 21 నుండి 29వ తేదీ వరకు వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

జూన్‌ 21వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1.00 నుంచి 4.00 గంటల వరకు పుష్పయాగం, సాయంత్రం 5.30 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయి. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.