KAVACHAM REMOVAL CEREMONY HELD_ శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా కవచం తొలగింపు

Tirumala, 19 June 2018: In connection with annual Jyestabhishekam in Tirumala temple from June 24 to 26, the Swarna Kavacham removal ceremony was held in the temple on Tuesday.

After the second bell, the processional deities were brought from the Srivari temple to Ranganayakula Mandapam and the armour adorned to Lord Sri Malayappa Swamy, Goddessess Sridevi and Bhudevi were removed.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా కవచం తొలగింపు

జూన్‌ 19, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారి ఉత్సవమూర్తులకు కవచం తొలగింపు కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రెండో గంట తరువాత రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంవత్సరం పొడవునా అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేస్తారు. జూన్‌ 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు కవచరహితంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు సేవల్లో దర్శనమిస్తారు.

జూన్‌ 24వ తేదీన జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా మొదటిరోజు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచం, రెండో రోజు ముత్యాలకవచం, మూడో రోజు తిరిగి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.