KOIL ALWAR TIRUMANJANAM PERFORMED AT APPALAYAGUNTA_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Appalayagunta, 19 June 2018: Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta geared up to host the nine day annual Brahmotsavams and as a prelude to it the entire temple was cleansed by performing Koil Alwar Tirumanjanam on Tuesday.

This traditional fete was observed between 8am and 11am. The staffs cleansed the entire walls, roofs, puja utensils of the temple with an aromatic mixture called Parimalam.

Later the devotees were allowed for darshan of Lord Sri Prasanna Venkateswara Swamy from 11.30am onwards.

Meanwhile the brahmotsavams will commence from June 23 with Ankurarpanam on June 22.

Temple SPl.Gr.Dy.E.O Sri P Munirathnam Reddy, AEO Sri Subrahmanyam, Superintendent Sri Gopala krishna Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి,2018 జూన్‌ 19: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జూన్‌ 23 నుండి జూలై 1వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

23-06-2018(శనివారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం

24-06-2018(ఆదివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

25-06-2018(సోమవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

26-06-2018(మంగళవారం)కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

27-06-2018(బుధవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

28-06-2018(గురువారం) హనుమంత వాహనం గజ వాహనం

29-06-2018(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

30-06-2018(శనివారం) రథోత్సవం అశ్వవాహనం

1-07-2018(ఆదివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 26వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నం రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంటు శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, ఆర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.