ANNAMAIAH SANKEERTANS ENLIGHTENED SOCIETY _ జ‌న ‌బాహుళ్యంలోకి అన్నమయ్య సంకీర్త‌న‌లు – టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్

TIRUPATI, 16 MAY 2022: The Sankeertans penned by Saint Poet Sri Tallapaka Annamacharya were not only dedicated to Sri Venkateswara Swamy but also enlightened the society in those days, said TTD CVSO Sri Narasimha Kishore.

 

The Chief Cop of TTD participated in the 614th Jayanti fete of Padakavita Pitamaha at Tirupati in Mahati Auditorium in Monday evening.

 

Sri Phani Narayana of Hyderabad presented alluring vocal concert while students of SV College of Music and Dance under the guidance of Smt Sailaja performed a dance ballet on Vengamamba life.

 

Annamacharya Project Director Dr A Vibhishana Sharma, Astana Vidwan of TTD Dr G Balakrishna Prasad were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జ‌న ‌బాహుళ్యంలోకి అన్నమయ్య సంకీర్త‌న‌లు – టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్

– ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గానం

తిరుపతి, 2022 మే 16: పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు టీటీడీ కృషి చేస్తోంద‌ని సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో భక్తి సంగీత కార్యక్రమాలు సోమ‌వారం సాయంత్రం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ, శ్రీ తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేల సంకీర్తనలు రచించినట్లు తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలు ప్రపంచమంతటా వ్యాప్తి చేసి శ్రీవారి తత్వాన్ని ప్రజలందరికీ తెలియజేయాలన్నారు.

హైదరాబాద్ కు చెందిన శ్రీ ఫ‌ణినారాయ‌ణ‌ బృందం ఆలపించిన ” భావ‌ములోన బాహ్య‌మునందును…., నారాయ‌ణ‌తే న‌మో న‌మో…., పొడ‌గంటిమ‌య్యా…., ఎంత‌మాత్ర‌మున ఎవ్వ‌రు ద‌ల‌చిన‌…., కొండ‌ల‌లో నెల‌కొన్న కోనేటిరాయ‌డు…, అన్నమయ్య సంకీర్త‌న‌లు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తరువాత శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థులు శ్రీమ‌తి శైల‌జ ఆధ్వర్యంలో శ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రపై పై నృత్యరూపకం ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్. విభీషణ శర్మ, టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.