AP CM INAUGURATES SRI VENKATESWARA SAPTHA GO PRADAKSHINA MANDIRAM _ శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

TIRUMALA, 11 OCTOBER 2021: The Honourable CM of Andhra Pradesh, Sri YS Jagan Mohan Reddy on Monday inaugurated Sri Venkateswara Sapta Go Pradakshina Mandiram at Alipiri Padala Mandapam.

TTD has prioritized Go Samrakshana as a significant Seva of rededication to Sri Venkateswara Swamy. With a noble aim to take the importance of Gomata in a widespread manner, TTD has set up Sri Venkateswara Sapta Go Pradakshina Mandiram at a cost of Rs 15 crore donated by a Chennai based devotee Sri AJ Sekhar Reddy to facilitate devotees with Go puja.

The complex comprises Sri Venkateswara Sapta Go Pradakshina Mandiram, Go Tulabharam, Go Vijnan Kendra, and Go Sadan.

Sri Venkateswara Sapta Go Pradakshina Mandiram:

 Symbolic to Seven Hills, Seven Desi cows along with calves will be housed in this Go Pradakshina Mandiram with the statue of Sri Venugopala Swamy in the middle.

The pedestrian devotees while trekking the Alipiri footpath route, first and foremost will have Go Darshanam and shall offer Go puja, Go Pradakshina and shall also perform Special pujas for Graha Shanti.

GO TULABHARAM

  Devotees can redeem their vows with Go Tulabharam. They shall donate the fodder equal to the weight of the cow through the Go Tulabharam

GO VIJNANA KENDRAM

  • TTD has set up a pictorial display highlighting Desi Cow breeds, their extinction, need to restore their breeds through Cow protection and Cow worship in Indian society in this Go Vijnana Kendram.

GO SADAN

Different breeds of Cows are housed in Go Sadan and measures have been ensured to protect these cows in this well-built structure.

MPs Sri Gurumurty, Sri Mithun Reddy, Sri V Prabhakar Reddy,Deputy Speaker K Raghupati, Deputy CM Sri Narayana, Ministers Sri V Srinivasa Rao, Sri P Ramachandra Reddy, Sri M Gautam Reddy, local MLA Sri Karunakar Reddy, TTD Chairman Sri YV Subba Reddy, Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, Donor Sri AJ Sekhar Reddy and others were also participated in this inaugural event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 11: తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమ‌వారం ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ|| ముఖ్య‌మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు.

తిరుమల తిరుపతి దేవస్థానములు గోసంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ భక్తులు ముందుగా సకలదేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత చెన్నైకి చెందిన దాత అందించిన రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టిటిడి నిర్మించింది. తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తులకు అనువుగా ఉండే చోట ఈ మందిరం నిర్మించడం జరిగింది.

ప్రాముఖ్యతలు

ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం, గోదర్శనం, గోపూజ, ప్రత్యేకంగా గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరం ఏర్పాటు చేయడమైనది. భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యములు గానీ, గ్రాసం గానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించడం జరిగింది. కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్‌లో ఉంచి వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్ నిర్మించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి, మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు శ్రీ గురుమూర్తి, శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, జె ఈ ఓ శ్రీమతి సదా భార్గవి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ రెడ్డి, దాత శ్రీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.