AP GOVERNOR VISITS TIRUCHANOOR_ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

Tirupati, 30 August 2017: AP and Telangana Governor Sri ESL Narasimhan along with wife Smt Vimala Narasimhan today visited the Sri Padmavati ammavari Temple at Trichanoor and had darshan of the deity.

The Governor and his spouse were received with temple hours by the Executive Officer Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri Pola Bhaskar and CVSO Ake Ravikrishna along with temple priests. The Governor couple were presented Shesha vastram and theertha prasadams.

Speaking on the ocassion the Governor said that he was very happy to have darshan and blessings of the deity Goddess Padmavathi and that he had prayed for well being, peace and prosperity of the people of AP and Telangana.

Chittoor District Collector Sri PS Pradyumna, Joint collector Sri Girish Shah, TTD Additional CVSO Sri Siva Kumar Reddy, Temple Spl Grade DyEO Sri Muniratnam Reddy, AVSO Sri Parthasarathi Reddy participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

ఆగస్టు 30, తిరుపతి, 2017: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని బుధవారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌ సతీ సమేతంగా దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, అర్చక బృందం కలిసి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందించారు.

ఈ సందర్భంగా గౌ|| గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీ పిఎస్‌.ప్రద్యుమ్న, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ గిరీష్‌ షా, టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఎవిఎస్‌వో శ్రీపార్థసారధిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.