SRIVARI SEVA TO BE PERFORMED FROM NOV 2017- JEO SRI KS SREENIVASA RAJU_ నవంబరు నుంచి శ్రీవారి సేవలో మౌలిక మార్పులు: జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala,30 August 2017: The TTDs unique voluntary corps of the Srivari Seva will be transformed with several basic changes from November, 2017 to render quality service to devotees.

Speaking at a review meeting on Srivari Seva, Anna prasadam, Vigilance, Kalyana katta, IT and Health departments at the Gokulam guest house on Wednesday the Tirumala JEO Sri KS Srinivasa Raju said that the IT department has been directed to conceive a new software to facilitate the Srivari Seva services for 3 days and 4 days slots.

He said on the directions of the EO, several new steps were also taken up to further strengthen and technically rejuvenate the Srivari Seva. Lauding the Srivari Sevakulu for rendering stellar services he said they were aiding the large number of devotees that throng the Tirumala hill shrine for darshan of Lord Venkateswara. The Srivari Sevaks could now register themselves with online facility.

The JEO also urged all able bodied persons to come forward for Srivari voluntary service and also involve their neighbors in Lords service.

IT Head Sri Shesha Reddy, VGO Sri Ravindra Reddy, DyEOs Sri Kodandarama Rao, Sri Venugopal, Sri Venkataiah and Sri Rajendrudu participated in the review meeting.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

నవంబరు నుంచి శ్రీవారి సేవలో మౌలిక మార్పులు: జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఆగస్టు 30, తిరుమల, 2017: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత ఉన్నతమైన ప్రమాణాలతో అత్యుత్తమ సేవలు అందించేందుకు శ్రీవారి సేవ విభాగంలో నవంబరు నుంచి పలు మౌలిక మార్పులు తీసుకొస్తున్నామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల సమావేశ మందిరంలో బుధవారం శ్రీవారి సేవ విభాగంపై శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, కల్యాణకట్ట, ఐటి, ఆరోగ్య విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులు శ్రీవారి సేవ చేసేందుకు నూతనంగా 3 రోజులు, 4 రోజుల స్లాట్లను ప్రవేశపెట్టేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఐటి అధికారులను ఆదేశించారు. ఈవో సూచనల మేరకు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీవారి సేవకులు అద్భుతమైన సేవలందిస్తూ భక్తులతో మమేకమవుతున్నారని తెలిపారు. శ్రీవారి సేవకు నమోదు చేసుకునేందుకు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌ సౌకర్యం కూడా కల్పించామన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న శ్రీవారి సేవకులు సేవకు రావాలని, ఇరుగుపొరుగువారిని కూడా భాగస్వాములను చేయాలని సేవకులకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో టిటిడి ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీకోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, శ్రీ వెంకటయ్య, శ్రీ రాజేంద్రుడు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.