MAIDEN KARTHIKA VANA BHOJANAM IN SRINIVASA MANGAPURAM PARUVETA MANDAPAM OBSERVED WITH RELIGIOUS ECSTASY_ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక వనభోజనాలు

Srinivasa Mangapuram, 15 November 2017: The first ever Karthika Vanabhojanam was observed with religious ecstasy in the Paruveta Mandapam located near Srivari Mettu at Srinivasa Mangapuram on Wednesday noon.

Hundreds of devotees converged to the Paruveta Mandapam premises located near the lush green forests of Seshachalam ranges.

Earlier the processional deities of Sri Kalyana Venkateswara Swamy, Sridevi and Bhudevi were brought from Srinivasa Mangapuram temple in a celestial procession and Snapana tirumanjanam was performed to the deities amidst chanting of Vedic mantras.

Later Asthanam was performed. TTD has made elaborate arrangements of Annaprasadam and also Karthika Vanabhojanam in a grand manner in this maiden fete.

Tirupati JEO Sri P Bhaskar, Temple DyEO Sri Venkataiah, EE Sri Manohar and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక వనభోజనాలు

తిరుపతి, 2017 నవంబరు 15: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కార్తీకవనభోజనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లు ఊరేగింపుగా ఆలయం నుండి శ్రీవారి మెట్టు మార్గంలోని పార్యేట మండసానికి చేరుకున్నారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు పార్వేట మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. ఆనంతరం ఆస్థానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ వనభోజనానికి విచ్చేసిన వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని ప్రారంభించారు. టిటిడి ఏర్పాటు చేసిన వనభోజనంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను భక్తులకు వడ్డించారు. శ్రీవారి వనభోజనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

అనంతరం మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పార్వేట మండపం నుండి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఏఈవో శ్రీ ధనంజయ, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.