CHAIRMAN INSPECTS TIRUMALA_ తిరుమలలో టిటిడి ఛైర్మన్‌ తనిఖీలు

Tirumala, 22 June 2018: TTD Chairman Sri P Sudhakar Yadav on Friday noon inspected shopping complex area located at Old annaprasada Bhavan in Tirumala.

He noticed that some of the shopkeepers who violated the norms of TTD and occupying extra space than allocated area. He instructed them to remove the allegedly occupied area immediately and said he will again inspect on Saturday. He also inspected the shoe keeping counter.

Later he had seen the newly erected display board at Golla Mandapam in front of the temple in five different languages for the information of the pilgrim public.

SE II Sri Ramachandra Reddy, EE I Sri Subramanyam, AVSO Sri Chiranjeevi were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో టిటిడి ఛైర్మన్‌ తనిఖీలు

జూన్‌ 22, తిరుమల 2018: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలోని పాత అన్నదాన భవనం వద్ద గల షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రాంతాన్ని తనిఖీ చేశారు.

టిటిడి నిబంధనలను అతిక్రమించి పలువురు దుకాణదారులు కేటాయించిన స్థలం కంటే ఎక్కువ ఆక్రమించినట్టు ఛైర్మన్‌ గుర్తించారు. ఆక్రమణలను వెంటనే తొలగించాలని దుకాణదారులకు సూచించారు. శనివారం మరోమారు తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. ఆ తరువాత పాదరక్షలు భద్రపరిచే కౌంటర్లను పరిశీలించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా గల గొల్ల మండపం వద్ద ఐదు భాషల్లో భక్తులకు సమాచారం అందించేందుకు వీలుగా నూతనంగా ఏర్పాటుచేసిన డిస్‌ప్లే బోర్డును ఛైర్మన్‌ పరిశీలించారు.

టిటిడి ఛైర్మన్‌ వెంట ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఇఇ-1 శ్రీ సుబ్రమణ్యం, ఎవిఎస్‌వో శ్రీ చిరంజీవి తదితరులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.