APPLICATIONS FOR ADMISSIONS INTO SV COLLEGE OF MUSIC AND DANCE FROM DECEMBER 8 _ డిసెంబ‌రు 8 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 4 Dec. 20: The applications from candidates for admissions in to TTD run SV College of Music and Dance in Tirupati has been invited from December 8 onwards.

The interested candidates shall apply for their desirable courses from December 8 to 26. The students have to pay Rs.50 towards application fees. 

According to Principal Smt Jamuna Rani, Bharatanatyam, Kuchipudi, Harikatha, Carnatic Vocal, instrumental courses including Veena, Flute, Mridangam, Violin, Nadaswaram, Dolu, Ghatam are available. B Music, B Dance, Visarada, Praveena courses are available.  In SV Nadaswaram School, apart from Certificate and Diploma Regular courses, part-time evening course is also available.

For Regular courses, the minimum qualification required is Eighth Standard and for Evening course, fifth standard. The interviews will be held to the students from December 28 to 31 in a phased manner. 

For more details contact Ph:0877 2264597 during regular office hours on working days.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రు 8 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 04: టిటిడి ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిసెంబ‌రు 8 నుండి 26వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, మృదంగం, ఘ‌టం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ విభాగాలున్నాయి. బి.మ్యూజిక్‌, బి డ్యాన్స్‌, విశారద, ప్రవీణ కోర్సులున్నాయి. ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్‌, డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులతోపాటు సాయంత్రం కళాశాల పార్ట్‌టైమ్‌ కోర్సులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని కోర్సుల వారికి డిసెంబ‌రు 28 నుండి 31వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.