ASTABANDHANA BALALAYA MAHASAMPROKSHANAM IN TIRUMALA TEMPLE FROM AUGUST 12-16_ ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ : జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు

COULD HARDLY PROVIDE DARSHAN TO 30 THOUSAND PILGRIMS A DAY DURING THAT PERIOD

TIRUMALA JEO APPEALS TO PILGRIMS TO PLAN ACCORDINGLY

Tirumala, 28 June 2018: Astabandhana Balalaya Mahasamprokshanam, the vedic ritual prescribed in Agamas, that is observed once in 12 years, will be observed in Tirumala temple from August 12 to 16 with Ankurarpanam on August 11.

In connection with this vedic event, Tirumala JEO Sri KS Sreenivasa Raju convened a review meeting with senior officers of TTD at Annamaiah Bhavan in Tirumala on Thursday.

After the review meeting, the JEO briefed media persons on the arrangements and amendments in pilgrim darshan during the said period in Tirumala temple. Some excerpts:

* Ankurarpanam for the religious fete will be observed between 9pm and 10pm on August 11
* The auspicious muhurat for Astabandhana Balalaya Maha Samprokshanam has been decided by the Agama Advisors in Tula Lagnam between 10:16am and 12 noon on August 16
* The religious function takes place in Old Kalyana Mandapam i.e.the present currency Parakamani area located in Vimana Prakaram
* From July 20 onwards, the parakamani will be carried out in Kalyana Mandapam from 2pm till 11pm till the completion of Mahasamprokshanam.
* Ornamental and Sculptural repair works will be taken up to the main and sub-temples of Tirumala temple
* All the works pertaining to rituals including setting up of Vedikas, Homa Gundem etc. will be completed by August 8.
* The Chief Priest and Agama Advisor Sri Venugopala Deekshitulu will act as Pradhana Acharya (Kankanabhattar) of the entire religious event
* 44 Ritwiks and over 100 Veda Parayanamdarulu, Prabandha Pandits, Vedic students are going to take part in the religious function
* Mahashanti Tirumanjanam will be performed on August 15 to Mulavirat and Parivara Devatas.
* Mandalabhishekam will be observed for 48 days from August 17 to October 3
* During these days, nobody will be allowed for darshan beyond Jaya – Vijaya
* After Kalakarshana on August 12, even the temple staff are allowed to enter inside temple upto Ramulavari Meda point only.
* TTD has cancelled all arjitha sevas from August 12 to 16
* Tomala and Archana sevas are restricted only to Udayasthamana Seva devotees on August 11 and 12 only
* VIP break darshan restricted to only protocol VIPs on August 11 and 12 and no break darshan from August 13 to 16
* As the darshan hours during this period is less than usual, TTD could be able to provide darshan of Lord to a maximum of 30-35 thousands per day only.
* The JEO appealed to the pilgrim devotees, to plan their darshan programme accordingly to avoid inconvenience.

CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, CVSO In-charge Sri Siva Kumar Reddy, SE II Sri Ramachandra Reddy, Deputy EO Temple Sri Harindranath and other officers were also present.

FOR THE LONGEVITY OF MULAVIRAT AND PARIVARA DEVATAS

Astabandhana Balalaya Mahasamprokshanam is performed once in 12 years as per the tenets of Agama Shastras for the longevity of the presiding deity as well as the other parivara deities, said Agama Advisor Dr NAK Sunderavaradan.

Briefing the media on the importance of this ritual, the scholar said, he has been taking part in the special religious fete since 1958. I had the privilege of having performed the Mahasamprokshanam in 2006 under my supervision”, he added.

BIMBAM TO KUMBHAM

The power of presiding deity, other parivara devatas and utsava murthies is transferred in to a special pot kept in yagashala during this Mahasamprokshanam, said Tirumala Chief Priest and Agama Advisor Sri Venugopala Deekshitulu. It is usually power transfer from Bimbam to Kumbham. This special religious fete is performed to enhance the longevity of the deities”, he maintained.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ : జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు

జూన్‌ 28, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు జరుగనుందని టిటిడి తిరుమల జెఈవో శ్రీకెఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ వైదిక కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉన్న అన్ని ఉప ఆలయాలకు మహాసంప్రోక్షణ జరుగుతుందని, ఇందుకు సంబంధించిన యాగశాల కార్యక్రమాలు అదనపు పరకామణి ప్రాంగణంలోని పాత కల్యాణమండపంలో నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 11న అంకురార్పణంతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులైన శ్రీవేణుగోపాలదీక్షితులు కంకణభట్టార్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. 40 మందికిపైగా ఋత్వికులు, దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు పాల్గొంటారని వివరించారు.

ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు ఎవరినీ జయవిజయులను దాటి దర్శనానికి అనుమతించరని, బ్రేక్‌ దర్శనాలు ఉండవని జెఈవో తెలిపారు. ఆగస్టు 12న ”కళాకర్షణ” తరువాత సన్నిధి సిబ్బందిని కూడా రాములవారి మేడ దాటి అనుమతించరని చెప్పారు. ఆగస్టు 11, 12వ తేదీల్లో నిర్వహించే తోమాల, అర్చన సేవలు ఉదయాస్తమాన సేవ భక్తులకు మాత్రమే పరిమితమవుతాయన్నారు. ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు అన్ని ఆర్జితసేవలు రద్దయ్యాయని, ఆగస్టు 15న మహాశాంతి తిరుమంజనం నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 16న ఉదయం 10.16 గంటలకు తులా లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 17 నుండి అక్టోబరు 3వ తేదీ వరకు 48 రోజులపాటు మండలాభిషేకం జరుగనుందన్నారు.

మహాసంప్రోక్షణ జరిగే 5 రోజుల్లో ఒక రోజుకు 30 వేల మంది భక్తులకు మించి దర్శనం చేయించలేదని పరిస్థితి ఉంటుందని జెఈవో తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమలయాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాల కోసం శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్‌, ఉద్యానవనం, విజిలెన్స్‌ తదితర విభాగాల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్టు చెప్పారు.

1958వ సం|| నుండి మహాసంప్రోక్షణలో పాల్గొంటున్నా : శ్రీ సుందరవరదన్‌

టిటిడి ఆగమసలహాదారు శ్రీ సుందరవరదన్‌ మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో 1958వ సంవత్సరం నుండి తాను మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. 2006లో తన ఆధ్వర్యంలోనే మహాసంప్రోక్షణ జరిగిందన్నారు. అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణమని, దీని ఆయుర్దాయం 12 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతారని వివరించారు.

దేవతాశక్తి బింబం నుండి కుంభంలోకి ఆవాహన : శ్రీ వేణుగోపాల దీక్షితులు

శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూలమూర్తి, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుండి కుంభంలోకి ఆవాహన చేసి ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమయంలో గర్భాలయంలోని మరమ్మతులను కూడా అర్చకులే నిర్వహిస్తారని చెప్పారు. మూలమూర్తికి జరిగే సేవలను యాగశాలలోని స్వామివారికి కూడా నిర్వహిస్తామని వివరించారు.

అంతకుముందు జరిగిన సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీరవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.