ASTOTTARA SATAKALASABHISHEKAM IN KRT_ శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
Tirupati, 28 June 2018: The Astottara Sata Kalasabhishekam was performed in Sri Kodanda Rama Swamy temple on Thursday.
On the occasion of Pournami, this religious ritual is performed every month. Abhishekam is performed with 108 kalasams to the utsava murthies.
Temple DyEO Smt Jhansi and other temple staff members were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి, 2018 జూన్ 28: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో గురువారం అష్టోత్తర శతకలశా భిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని మహామండపంలో ఉదయం 10.00 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.