అక్టోబరు 1న శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
అక్టోబరు 1న శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు తిరుపతి, సెప్టెంబరు 25, 2013: తిరుపతికి సమీపంలో తితిదేకి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు ఒకటో తేదీన పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 30న అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు […]
