TTD EO INSPECTS SRI VETURI PRABHAKARA SASTRY MANUSCRIPTS AT SVETA _ వేటూరి సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు కృషి : తితిదే ఈవో
వేటూరి సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు కృషి : తితిదే ఈవో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్యాన్ని భద్రపరిచి భావితరాలకు అందించేందుకు కృషి జరుగుతోందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గల శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం కార్యాలయంలో సోమవారం ఆయన పీఠం కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వేటూరి వారి తాళపత్ర గ్రంథాలను శాస్త్రీయ పద్ధతిలో ఓరియంటల్ రీసర్చి ఇనిస్టిట్యూట్(ఓఆర్ఐ) ద్వారా శుద్ధి చేయాలని కోరారు. […]
