SIMHA VAHANA SEVA OBSERVED _ సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి అభయం
సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి అభయం తిరుపతి, 2022 జూన్ 12: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం యోగనరసింహుని అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. స్వామి వారు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిష్టిస్తారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే […]
