BALALAYAM CONCLUDES _ శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన “బాలాలయ సంప్రోక్షణ”

TIRUPATI, 27 APRIL 2023: The Balalaya Mahasamprokshana In Sri Seshachala Lingeswara Swamy temple at Kanduvaripalle in Chandragiri concluded on a grand note on Thursday with Purnahuti.

 

DyEO Sri Devendra Babu, AEO Sri Parthasaradhi, Superintendent Sri Srinivasulu, Archakas were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన “బాలాలయ సంప్రోక్షణ”

తిరుపతి, 2023 ఏప్రిల్ 27: చంద్రగిరి మండలం కందులవారి పల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ గురువారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది.

ఉద‌యం 7.30 గంట‌లకు గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల పూజ నిర్వహించారు. అనంతరం ఉదయం 10.55 గంట‌లకు పూర్ణాహుతి, సంప్రోక్ష‌ణ‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరిండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు శ్రీ పార్థసారధి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.