BASELESS RUMOURS AGAINST TTD _ ఆ ప్రచారాలన్నీ అవాస్తవాలు : టీటీడీ.

Tirumala, 3 May 20: TTD denied the reports that Srivari temple was opened up on Friday for sake of TTD chairman Sri YVSubba Reddy for darshan and also that it has sacked1300 sanitary workers.

In a statement released on Sunday, TTD clarified that daily rituals are being continued in the Srivari temple in Ekantam even during lockdown period.

The TTD Chairman Sri YV Subba Reddy, being the Trust Board Chief holds the supervisory powers to observe rituals in Tirumala and TTD temples. As a part of this he visited the temple on Friday.

On May 1, Friday, incidentally it happened to be the birthday of Chairman and he visited temple along with his spouse and mother. Rumours that TTD has opened the temple doors for Chairman is completely baseless. The Chairman shall participate in Friday Abhishekam for two weeks in a month as per norms of TTD which is in vogue since several years.

TTD board members and officials are committed to preserve the basic Agama traditions and Sanatana Dharma.

It is unfortunate that such unnecessary and unwanted allegations are heaped on TTD by vested interests in spite of strictly observing and respecting the norms in the temple as per religious tenets.

Facts about sanitary workers:

The term of the sanitary facilitation contractor ended on April 30 and no tender proceedings were taken up during the Corona Lockdown period as per court directions. Once the lockdown period is completed, TTD will take up the tender process.

However a section of media reports have ignorantly put the blame on TTD that it has removed 1300 sanitary workers without verifying the actual facts.

In spite of this, the TTD has extended the contract period for one more month on humanitarian grounds.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఆ ప్రచారాలన్నీ అవాస్తవాలు : టీటీడీ.

తిరుమల. 3 మే 2020: టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి కోసం అధికారులు తిరుమల ఆలయం తలుపులు తెరిచి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని కొంతమంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవం . అలాగే 1300 మంది పారిశుధ్య కార్మికులను టీటీడీ తొలగించిందని జరిగిన ప్రచారం కూడా పూర్తిగా అవాస్తవం.

సేవలు జరుగుతూనే ఉన్నాయి.

లాక్డౌన్ నేపథ్యంలో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో స్వామి వార్లకు సేవలు, పూజలు, కైంకర్యాలు ఆగమోక్తంగా ఏకాంతంగా జరుగుతూనే ఉన్నాయి. టీటీడీ పరిధిలోని ఆలయాల నిర్వహణను పర్యవేక్షించడం, పరిశీలించడం చైర్మన్ విధుల్లో ఒక భాగం. ఇందులో భాగంగానే చైర్మన్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. అధికారులతో అనేక విషయాలు చర్చించారు. అంతే కానీ చైర్మన్ కోసం ఆలయ తలుపులు తెరిచామని కొంత మంది ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవం. నెల లో రెండు శుక్రవారాలు చైర్మన్ స్వామి వారి అభిషేక సేవలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. గత శుక్రవారం ఆయన పుట్టిన రోజు రావడం యాదృచ్చికం. ఆలయానికి ఆయన తన భార్య, తల్లి తో మాత్రమే వచ్చారు. ఫోటోలోని మిగిలిన వారంతా టీటీడీ ఉద్యోగులే. సనాతన ధర్మాన్ని , ఆచారాలను కాపాడటానికి పాలక మండలి, అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. టీటీడీ మీద ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం.మంచిది కాదు.

ఇదీ వాస్తవం.

కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల కు సంబంధించిన టెండర్ గత నెల 30వ తేదీతో ముగిసింది. అంతే కానీ టీటీడీ వారిని తొలగించలేదు. వాస్తవం ఇలా ఉంటే మే 1వ తేదీన టీటీడీ 1300 మంది పారిశుద్య కార్మికులను తొలగించినట్లు కొంతమంది ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో అవాస్తవ ఆరోపణలు, ప్రచారాలు చేయడం బాధాకరం. లాక్డౌన్ కాలం లో ఎలాంటి టెండర్ ప్రక్రియలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. లాక్డౌన్ ముగిశాక టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాం.అయినా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మానవతా హృదయంతో సదరు కాంట్రాక్టు ను నెల రోజుల పాటు పొడిగించాము.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది