EO INSPECTS NEWLY DEVELOPED LAWN IN ADMIN BUILDING _ ఉద్యానవనాలు అందంగా తయారు చేశారు : టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

TIRUPATI, 22 JULY 2021: While appreciating the newly developed lawn in the quadrangle of the TTD Administrative Building, the EO Dr KS Jawahar Reddy instructed the officials concerned to plant more varieties of aesthetic, traditional, fruit bearing plants in the lawns.

TTD EO along with JEO Smt Sada Bhargavi inspected the newly developed lawn where seating arrangements have also been made. As a part of his visit, the EO also planted a Kalpavriksha tree (Baobab or Adansonia digitata).

Apart from planting trees, the EO also directed the officials concerned to fix the responsibility of their protection for a safe growth.

Later he inspected the completed works in the SE’s office and made some suggestions to the Engineering officials.

FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, SEs Sri Jagadeeshwar Reddy, Sri Venkateswarulu, DFO Sri Chandra Sekhar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఉద్యానవనాలు అందంగా తయారు చేశారు : టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 22 జూలై 2021: టీటీడీ పరిపాలన భవనం సముదాయంలో ఉద్యాన వనాలు అందంగా తయారుచేసి మంచి మొక్కలు నాటారని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను అభినందించారు.

పరిపాలన భవనంలోని ఉద్యాన వనంలో గురువారం ఆయన కల్ప వృక్షం చెట్టు నాటారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, లాన్ చక్కగా తయారు చేశారన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యత ఎవరికైనా అప్పగించాలన్నారు. అంతకుముందు ఆయన
ఎస్ఈ కార్యాలయంలో పూర్తి చేసిన ఆధునీకరణ పనులు పరిశీలించారు. కార్యాలయాల వెనుకవైపు గోడలకు సున్నం కొట్టించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.

జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ లు శ్రీ జగదీశ్వరరెడ్డి, శ్రీ వెంకటేశ్వర్లు, డి ఎఫ్ ఓ శ్రీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది