BHAGAVAT GITA COMPETITIONS HELD ON DECEMBER 5 _ అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థం పోటీలు
Tirupati, 05 DECEMBER 2021: With an aim to inculcate the great values of our Sanatana Hindu Dharma among youth, TTD has conducted a Srimad Bhagavat Gita recitation competition to students on December 5 in both Telugu states, Bengaluru and Chennai.
These competitions for the Tirupati region were organized at Annamacharya Kalamandiram in Tirupati on Sunday. Over 200 students hailing from various schools took part in this feat.
This competition was held under the aegis of the HDPP wing of TTD. The Special Officer of Dasa Sahitya Project Sri Anandatheerthacharyulu addressed the students at the beginning of the programme.
Scholars from National Sanskrit University were invited as judges for the competition. The students recited the shlokas from the 17th Chapter, Shradhatraya Vibhaga Yogam.
The students were categorised as Junior that includes 6th and 7th class students while students of 8th and 9th standards were categorised as Seniors.
These competitions were held in the respective District HQs and also at Bengaluru and in Chennai. The winners seniors on December 14 on the occasion of Gita Jayanthi.
HDPP AEO Sri Satyanarayana, special officer Sri Hemanth were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థం పోటీలు
తిరుపతి, 2021 డిసెంబర్ 05: తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలతో పాటు గురువాయూరు,బెంగళూరు, చెన్నైలో ఆదివారం భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహించారు.
తిరుపతిలోని టిటిడి పాఠశాలలు, ఇతర పాఠశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. శ్రద్దాత్రయ విభాగ యోగంపై 6 మరియు 7 తరగతులు ఒక విభాగంగాను, 8 మరియు 9 తరగతులు మరో విభాగంగాను ఈ పోటీలు నిర్వహించారు. అల్లాగే 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీత కంఠస్థ విభాగం లో 18 సంవత్సరాల వయసు పైబడిన వారు, 18 సంవత్సరాల లోపు విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా పోటీలు నిర్వహించారు.
ముందుగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో పాటు స్థానికంగా ఉన్న పలువురు పండితులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ నెల 14వ తేదీ గీతాజయంతి సందర్భంగా విజేతలకు ఆయా కేంద్రాల్లో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎఈవో శ్రీ సత్యనారాయణ, ప్రత్యేకాధికారి శ్రీ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.