KALAVAIBHAVAM AT KALPAVRUKSHA VAHANAM_ కల్పవృక్ష వాహనసేవలో కళావైభవం ఆకట్టుకున్న ఎస్వీ బాలమందిరం విద్యార్థుల కోలాటం
Tirumala, 13 October 2018: Eighteen member team from Gujarat displayed traditional folk art forms and thrilled the devotees at the galleries of the four mada streets on the day four of ongoing Navaratri Brahmotsvams.
The display of Kolata by 50 girls and 30 boys of the SV Bala Mandir were among the various cultural events rolled out by the HDPP, Dasa Sahitya and Annamacharya project. Smt Yadhoda and Sri Shankar of Gurukul from Nalgonda trained them in various dance forms.
Among others 31 artists from Chhattisgarh presented Panti dance while 81dancers from Karnataka displayed their skills in Puja Kunita. Chilipuli Gombe, Dollu Kunita, Yakshagana, Samana Kunita and Konge dance.
Fifty-five artists from Telangana presentedVoggu dolu, KommaKoya, Gussadi dance .12 artists from Kerala performed Pancha Vadyham and 31 from Haryana presented several traditional art forms and thrilled devotees on mada streets.
Director of SVETA Sri N Mukteswar Rao, SV Bala mandir AEO Smt Tamara Selvi and Supdt Sri Sudhakar supervised the activities of SV Bala Mandir.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
కల్పవృక్ష వాహనసేవలో కళావైభవం ఆకట్టుకున్న ఎస్వీ బాలమందిరం విద్యార్థుల కోలాటం
అక్టోబరు 13, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సాంస్కృతిక బృందాలు కళావైభవాన్ని చాటాయి.
గుజరాత్ నుండి 18 మంది కళాకారులు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. ఛత్తీస్‌ఘర్ నుండి 31 మంది కళాకారులు పంతి నృత్యం, కర్ణాటక నుండి 81 మంది కళాకారులు పూజ కునిత, డొల్లు కునిత, చిలిపిలి గొంబె, యక్షగానం, సమన కునిత, కొంగేలు నృత్యప్రదర్శన చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి 55 మంది కళాకారులు ఒగ్గుడోలు, కొమ్ము కోయ, గుస్సాడి నృత్యం, కేరళ నుండి 12 మంది కళాకారులు పంచ వాద్యం, హర్యాణా నుండి 31 మంది కళాకారులు సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.
ఆకట్టుకున్న ఎస్వీ బాలమందిరం విద్యార్థుల కోలాటం
వాహనసేవలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర బాలమందిరం విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో 50 మంది బాలికలు, 30 మంది బాలురు పాల్గొన్నారు. శ్రీవారిపై అన్నమయ్య రచించిన పలు సంకీర్తనలను ఎంచుకుని వాటికి అనుగుణంగా అడుగులు వేస్తూ లయబద్ధంగా కోలాటం చేశారు.
బాల మందిరం విద్యార్థులకు చదువుతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు సైతం ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు శ్రీనివాస గద్యం, ఆదిత్యహృదయం, సూర్యాష్టకం, నామరామాయణం, సుప్రభాతం, స్తోత్రం, మంగళాశాసనం, రామానుజ గద్యాలను విద్యార్థులు సాధన చేశారు. కోలాటానికి సంబంధించి ముందుగా నల్గొండకు చెందిన గురువులు శ్రీ శంకర్, శ్రీమతి యశోద రెండు నెలలపాటు విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత బ్రహ్మోత్సవాలకు ముందు పది రోజుల నుండి విద్యార్థుల చేత సాధన చేయించారు.
టిటిడి శ్వేత సంచాలకులు శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్వీ బాలమందిరం ఏఈవో శ్రీమతి తామరసెల్వి, సూపరింటెండెంట్ శ్రీ సుధాకర్ విద్యార్థుల ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.