BHAKTI EXILIR AT TIRUPATI _ తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ – భక్తి రసరమ్య భరితంగా సాగిన “భక్తిసంగీతం”

Tirupati, 6 October 2019 : The arr lovers of temple city of Tirupati were thrilled by the exciting rendering of devotional Bhakti sangeet on Sunday evening as a part of the ongoing Srivari Brahmotsavams at Tirumala.

The Annamacharya project, HDPP, Dasa Sahitya Project, SV College of Music and dance presented various  events like Bhakti sangeet, harikatha, at Annmacharya Kala Mandiram, Mahati auditorium and Ramachandra Pushkarani.

The Bhakti sangeet rendered by Smt K Madhuri Guhan team of Anantpur supported by Ravi Kumar on violin, and Vannur swami on Mridangam mused audience.

At Mahati auditorium, the Tirupati team comprising Smt Nagasayi and Smt Meghana presented dance.

At the Ramachandra Pushkarani a group dance was rendered by the Bangalore team of Sri AV Satyanarayana which enthralled audience.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ –  భక్తి రసరమ్య భరితంగా సాగిన “భక్తిసంగీతం

తిరుప‌తి, 2019 అక్టోబరు 06 ; శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుప‌తిలో ఆదివారం టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.

 ఇందులో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అనంతపురం  చెందిన  శ్రీమతి కె మాధురి,  గుహన్ బృదం మృదుమధుర భక్తిసంగీత కార్యక్రమం వినసొంపుగా సాగింది. వీరు తమ భక్తిసంగీత కచేరిని  గణపతి ప్రార్థన తో ప్రారంభించి, తదుపరి అన్నమయ్య కృత దేవ దేవం భజ, నన్నుగన్న తల్లి న భాగ్యమ, నారాయణతే నమో నమో, చూడర సతులాల, సోబాన పాడరమ్మ, హరి నీమసమే అంతాను, ఆపై పురందర కృత బారో కృష్ణ బారో  కీర్తనలు పాడి సభను భక్తిసాగరంలో ముంచెత్తింది.. వీరికి వాయులీనంపై రవికుమార్, మృదంగంపై వన్నూరు స్వామి సహకరించారు.
   
 అదేవిధంగా తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఇ.నాగ‌సాయి మ‌రియు మేఘ‌న బృందం నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీ ఎ.వి.స‌త్య‌నారాయ‌ణ‌ బృందం నృత్య‌ కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.