BHASHYAKARULA SATTUMORA HELD _ శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర

TIRUMALA, 25 APRIL 2023: With the advent of Arudra Nakshatra in Vaisakha month, Sri Bhashyakarula Sattumora was held with spiritual fervour in Tirumala temple on Tuesday.

 

The great Sri Vaishnava Saint Sri Ramanujacharya was also known as Sri Bhashyakarula Varu for penning Sri Bhashyam for Brahmasutras.

 

After procession in the four mada streets, special pujas were performed in the Bhashyakarla Sannidhi located in the footpath route.

Later in the evening, after Sahasra Deeplanakara Seva, Sridevi Bhudevi sameta Sri Malayappa on one Tiruchi and Sri Bhasyakarula Varu on another Tiruchi graced devotees along four mada streets before entering the temple. Inside the temple, Bhashyakarula Sattumora was performed.

 

Both the senior and junior pontiffs of Tirumala, disciples, temple officials were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర

తిరుమల, 2023 ఏప్రిల్ 25: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టారు.

సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంత‌రం ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణగా విచ్చేసి భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు జ‌రిగింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.