GRAND CELEBRATION OF BHASHYAKARULU SATUMORA IN SRIVARI TEMPLE_ శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర
Tirumala, 21 April 2018: The annual festival of Sri Bhashyakarula Sattumora was grandly celebrated at the Srivari Temple on Saturday at the birth star of Arudra in Visakha month, the birth star of Sri Ramanujacharya.
As part of the event grand Abhisekham was performed at the sannidhi of Sri Bhashyakarlu in the Alipiri footpath after colorful procession on the four mada streets this morning.
Later in the evening, the utsava idol of Sri Bhashyakarlu were taken out again mada streets in a Tiruchi along with the Sri Malayappaswamy and his consorts on another Tiruchi after the Sahasra deepalankara seva and also pradakshina along the Vinama Prakasam.
The celestial event of sattumora performed in the night at the Sri Bhashyakarla sannidhi wherein special sallipu with ornaments was performed.
Among others Sri Sri Pedda Jeeyar swami and Sri Sri Sri Chinna Jeeyar Swami, temple officials and others participated in the event.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర
ఏప్రిల్ 21, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.