BHOGASRINIVASA MURTHY CONSECRATION DAY OBSERVED WITH SPECIAL ABHISHEKAM_ తిరుమలలో ఘనంగా శ్రీ భోగశ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం

Tirumala, 24 June 2017: The temple management of Tirumala Tirupati Devasthanams (TTD) observed the ceremonial consecration of Sri Bhoga Srinivasa Murthy, the silver replica statue of presiding deity in Tirumala shrine on Saturday with special Sahasra Kalasabhishekam.

To commemorate the historical occasion of the gifting of silver idol of Bhoga Srinivasa Murthy to the hill temple of Lord Venkateswara by the Pallava Queen Samavai (Perundevi) in 614 AD TTD has been observing this fete with religious fervour since 2006. The special ritual was observed at Bangaru Vakili in Ekantam between 6 a.m. and 8 a.m. after the completion of religious formalities. While the arjitha sevas like Kalyanotsavam, Unjalseva, arjitha brahmotsavam, vasanthotsavam and sahasradeepalankara seva took place as usual.

HISTORICAL IMPORTANCE: In the month of Jyestha, in the year 614 A.D., the Pallava Queen Samavai Perundevi donated 18 inches tall silver idol of Sri Bhoga Srinivasa Murthy to Tirumala Shrine. This silver idol is part of the Pancha Beras and it is also known as ‘Kautuka Bera’ in Agamic jargon. It is also called “Manavalapperumal”

HH Tirumala Pedda Jiyar Swamy, TTD EO Sri Anil Kumar Singhal, TirumalaJEO Sri KS Sreenivasa Raju, temple DyEO Sri Kodanda Rama Rao took part in this fete.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా శ్రీ భోగశ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం

తిరుమల, 2017, జూన్‌ 24: శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని టిటిడి శనివారం నాడు వైభవంగా నిర్వహించింది.

ఇందులో బాగంగా ఉదయం 6.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు.

చారిత్రక నేపథ్యం :

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెదజీయంగార్‌ స్వామి, టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.