DIFFERENT RELIGIOUS EVENT POSTERS IN TTD SUB TEMPLES RELEASED_ టిటిడి స్థానిక ఆలయాల ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి తిరుపతి జెఈవో

Tirupati, 24 June 2017: Tirupati JEO Sri P Bhaskar released a series of wall posters and handouts in his chambers in Tirupati in TTD Administrative building relating to various religious programmes of different sub temples in Tirupati on Saturday evening.

The events includes Pushpayagam in Sri Govindaraja Swam temple on June 30, Srivari Sakshatkara Vaibhavotsavamd and Paruveta Utsavam in Srinivasa Mangapuram on June 30 and July 1 respectively. The Pavitrotsavams posters related to Kapileswara Swamt temple from July 5-7 were also released.

The respective DyEOs Smt Varalakshmi, Sri Venkataiah and Sri Subramanyam were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానిక ఆలయాల ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2017 జూన్‌ 24: టిటిడి స్థానిక ఆలయలలో నిర్వహించే వివిధ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ శనివారం సాయంత్రం అవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్‌ 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు, జులై 1వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం జున్‌ 27వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందన్నారు.

అదేవిధంగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి జూన్‌ 29వ తేదీన సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుందన్నారు. జూన్‌ 30వ తేదీ ఉదయం స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1.00 నుంచి 4.00 గంటల వరకు పుష్పయాగం, సాయంత్రం 6.00 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయని జెఈవో తెలిపారు.

పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారని వివరించారు. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చని, గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారని తెలియజేశారు.

కాగా తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

జూలై 5వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, జూలై 6వ తేదీ గ్రంధి పవిత్ర సమర్పణ, జూలై 7వ తేదీ మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ పవిత్రోత్సవంలో ఇద్దరు గృహస్థులు రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరి రోజు పవిత్రమాల బహుమానంగా అందజేస్తారని జెఈవో తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవోలు శ్రీ వెంకటయ్య, శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.