BHOGI TERU IN SRI GT_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భోగి పండుగ

Tirupati, 14 Jan 19:In connection with auspicious Bhogi festival, Bhogi Teru observed in Sri Govinda Raja Swamy temple on Monday in Tirupati.

As a part of this festival Sri Krishna Swamy and Sri Andal Godai were seated on a small chariot and taken out for procession in four mada streets in the evening between 5.30pm and 7pm.

Later on January 15 following Makara Sankranthi festival, the Sudarshana Chakrattalwar will be taken to Alwar tank in Kapilatheertham and chakra snanam will be observed.

On January 16, Andal Sri Goda Parinayam and on January 17 Paruveta Utsavam will be observed

DyEO Smt Varalakshmi and other temple staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భోగి పండుగ

తిరుపతి, 2019 జనవరి 14: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమ‌వారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పించారు.

సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగి తేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.