BLESSED IN THE SERVICE OF GODDESS_ అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతం వాహ‌న‌సేవ‌లో త‌రిస్తున్న శ్రీ‌వైష్ణ‌వులు

Tiruchanoor, 10 Dec. 18: A team of Sri Vaishnavaites from Tamilnadu are considering it as their life time boon to render service during vahana devas of Goddess by carrying various vahanams on their shoulders.

Hailing from Sri Rangam, lead by Sri padam Sri L Narayana, about 48 members have been rendering this Vahanam carrying service from the last 27 years.

They have also been rendering similar service even in Sri Rangam also.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతం వాహ‌న‌సేవ‌లో త‌రిస్తున్న శ్రీ‌వైష్ణ‌వులు

తిరుపతి, 2018 డిసెంబరు 10: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సేవల్లో అమ్మవారి వాహనాలను మోస్తున్నది తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయపరులు.

శ్రీపాదం అనే పేరుతో శ్రీ ఎల్‌.నారాయ‌ణ‌ నేతృత్వంలో 27 ఏళ్లుగా అమ్మవారి వాహనసేవ కైంకర్యంలో పాలు పంచుకుంటున్నారు. వీరు మొత్తం 48 మంది ఉన్నారు. ఈ సేవకుల్లో ఐటి నిపుణులు, రైల్వే, బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయంలోనూ వీరు ఇలాంటి సేవలు అందిస్తున్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే వీరంతా తమ తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చేస్తారు. వీరికి టిటిడి ఉచితంగా బస, భోజనం కల్పించి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తోంది.

వాహ‌న‌సేవ‌కులు మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీపద్మావతి అమ్మవారిని తమ భుజస్కంధాలపై మోయడం పూర్వజన్మ సుకృతమన్నారు. అందరికీ ఈ అవకాశం రాదని, అమ్మవారి కృపతో తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉన్నాయని తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.