BLESSED TO SERVE AS SRIVARU-CHIEF AUDIT OFFICER _ టిటిడి ఉద్యోగులు అదృష్టవంతులు : చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర
Tirupati, 31 DECEMBER 2021: The Chief Audit Officer Sri Sesha Sailendra said that because of our good deeds in a previous birth, the Almighty has given us an opportunity to serve in His abode.
A felicitation event was held at the TTD Administrative building on Friday evening to honor the TTD employees who discharged their duties for over three decades in various TTD departments in different payrolls and laid down office on December 31.
Speaking on the occasion he congratulated all the 19 retiring employees on a long and healthy life with the blessings of Sri Venkateswara.
Thereafter he felicitated them with shawls and Veda Ashirvachanam by TTD Vedic pundits. Welfare Officer Sri Damodaram, DyEO Sri Devendrababu, and other officials participated in the event.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఉద్యోగులు అదృష్టవంతులు : చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర
ఉద్యోగ విరమణ చేసిన 19 మందికి సన్మానం
తిరుపతి, 2021 డిసెంబరు 31: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుని పాదాల చెంత సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేస్తున్నవారు ఎంతో అదృష్టవంతులని టిటిడి చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర అన్నారు. టిటిడిలోని వివిధ విభాగాల్లో పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన 19 మందికి పరిపాలన భవనంలో శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భగవంతుడిని చూడాలని, ఆ విధంగా భక్తుల సేవలో తరించిన మీరందరూ ఎంతో భాగ్యవంతులని అన్నారు. పెన్షనర్ల సంక్షేమానికి టిటిడి కట్టుబడి ఉందని, టిటిడి కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ దామోదరం మాట్లాడుతూ శ్రీవారి సన్నిధిలో సుదీర్ఘ కాలం పని చేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ఇంతటి గౌరవ సన్మాన కార్యక్రమం నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకున్నటిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవోలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ట్రెజరీ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన వారి శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడిచేలా శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఉద్యోగ విరమణ చేసిన వారందరికీ అధికారులు శాలువాలు కప్పి సన్మానించారు. తరువాత వారికి కుటుంబసభ్యులతో సహా అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ చేసింది వీరే
శ్రీమతి కె.గీతాంజలి(ప్రధానోపాధ్యాయరాలు), శ్రీ ఎన్.వెంకటరమణ(సూపరింటెండెంట్), శ్రీ వి.దేవిందిరన్(జూనియర్ అసిస్టెంట్), శ్రీ టి.చంద్రయ్య(షరాబు/అసిస్టెంట్), శ్రీ జె.జాఫర్ హుస్సేన్(షరాబు/అసిస్టెంట్), శ్రీ కె.ప్రహ్లాదరెడ్డి(షరాబు/అసిస్టెంట్), శ్రీ ఎ.రాజేంద్రన్(దఫేదార్), శ్రీ వి.మునికృష్ణయ్య(ఆఫీస్ సబార్డినేట్), శ్రీ ఇ.దాస్(సెక్యూరిటీ గార్డ్), శ్రీ వి.శంకర్(ఓఎస్ఓ కమ్ వాచ్‌మెన్), శ్రీ కె.రామమూర్తి రెడ్డి(అసిస్టెంట్ ఇంజినీర్), శ్రీ సి.గురవారెడ్డి(ఆపరేటర్), శ్రీ పి.లోకనాథం(ఫిట్టర్), శ్రీ సి.సాయిబాబ(మజ్దూర్), శ్రీ ఆర్.మునిచంద్రయ్య(జూనియర్ బైండర్), శ్రీమతి విశాలాక్ష్మి(ఆర్టిస్ట్), శ్రీ కె.రాజేంద్రయ్య(గార్డెనర్), శ్రీమతి కె.మొగిలీశ్వరి(షరాబు/అసిస్టెంట్).
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.